Breaking News

పరిపూర్ణానంద స్వామి గురించి


పరిపూర్ణానంద స్వామివారు నెల్లూరులో 1-11-1972న జన్మించారు.



14 సంవత్సరాల వయస్సులోనే, తల్లి కోరిక మేఱకు వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తూ సంతృప్తి చెందక, 16వ ఏట ఋషీకేశ్ చేరుకున్నరు. అచ్చట దయానంద సరస్వతి స్వామి వారి వద్ద భారతీయ వాఙ్మయాలను, ఉపనిషత్ సిద్దాంతాలను, భాష్యాలను అధ్యయనం చేశారు. వీటితో పాటు ఆగమ, మంత్ర, వాస్తు, జ్యొతిష్యములను కూడా వేరు వేరు గురువుల వద్ద అధ్యయనము చేసిన దార్శనికులు.



గురువుగారి ఆజ్ఞ అనుసారం ఆంధ్ర రాష్ట్రంలో తమ అమూల్యమైన ప్రవచనముల ద్వారా వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ 1999 సం.లో, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో శ్రీపీఠంలో ఐశ్వర్యంబికా సమేత సుందరేశ్వర స్వామివారల ప్రతిష్ఠను గావించారు.

కొన్ని సంవత్సరముల పాటు శ్రీపీఠం యొక్క అభివృద్ధిలో నిమగ్నమై అచ్చటనే ఉంటూ ప్రవచనములను, శిక్షణ శిబిరాలను మరియు సేవలను నిర్వహించారు. యావదాంద్రరాష్ట్రం కరువుకాటకాలతో వర్షాలు లేక బాధపడుతున్న సమయంలో 2002వ సం.లో శ్రీపీఠంలో 32 రోజులపాటు మహానక్షత్రయాగాన్ని నిర్వహించారు. తత్ఫలితంగా రాష్ట్రమంతా కుంభవృష్టి కురిసింది.

2003, 2004 సం.లో వరుసగా రాజమండ్రి గోదావరి పుష్కరాలలో 5 లక్షలమందికి, విజయవాడలో కృష్ణవేణి పుష్కరాలలో 6 లక్షలమందికి అన్నదానమును నిర్వహించారు.

ఆస్తిక, నాస్తికులనే భేదం లేకుండగా కుల, మత, వర్గ వయోభేదాలకతీతంగా యువతీ యువకులు చిన్నారులు సైతం శ్రీ వేంకటేశ్వర భక్తిఛానెల్ లో ఉదయం గం.7-00లకు ప్రసారమయ్యే స్వామివారి ప్రబోధాలకు కోట్లాదిమంది ప్రేక్షకులు మంత్రముగ్ధులౌతున్నారన్న విషయం లోకవిదితం.

యువపధం: యువతీ యువకుల భారతీయ సనాతన ధర్మాలపట్ల ఆసక్తిని కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి, తోడ్పడే అంశాలను ప్రబోధిస్తూ వేలాదిమందికి చక్కటి మార్గదర్శకాలను అందిస్తున్నారు.

మాతృదేవోభవ: మహిళలకు ధైర్యాన్ని, ఆత్మస్ధైర్యాన్ని కలిగించే అంశాలను, విషయాలను ప్రాచీన భారతీయ జీవన ప్రమాణాలతో కూడిన విలువలను బోధిస్తూ లక్షలాది మంది మాతృమూర్తులకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు.

అతిపిన్న వయస్సులోనే జ్ఞానయజ్ఞ ప్రవచనముల ద్వారా ఆంధ్రరాష్ట్రం నలుమూలలా అవిశ్రాంతంగా పర్యటిస్తూ హిందూధర్మాన్ని, భారతీయ వైభవాన్ని దిశదిశలా వ్యాపింపచేస్తున్నారు. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సమపాళ్ళలో మేళవించి అనేక భాషలలో కోట్లాదిమందిని చైతన్యపరుస్తున్న మనీషి - మహర్షి పరిపూర్ణానంద స్వామి

ఆయన బోధనలన్నీ మత సామరస్యాన్ని పెంపొందించేవిగానే ఉంటాయి. "నీ ధర్మాన్ని నీవు రక్షించుకుంటూ పరధర్మాల్ని గౌరవించాలని" ఆయన అంటారు. ఆ తర్వాత భారతదేశంలో హైందవ ధర్మం పై దాడులు పెరగడంతో హిందూ ధర్మ సంరక్షణ కోసం నడుం బిగించారు.

హిందూ రక్షా వేదిక అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పీఠాన్ని శిష్యులకు అప్పచెప్పి, ఆయన ప్రజల్లోకి వచ్చి, హైందవ ధర్మం గురించి బోధించడం మొదలుపెట్టారు. ఆయన బోధనలలో భగవద్గీత యువతీ యువకులను సైతం ఎంతో ప్రభావితం చేసింది. దేశంలో మతమార్పిడులు జరుగుతున్నాయని గ్రహించిన ఆయన వాటికి అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు.

అందులో భాగంగానే హిందూ మనోరథ యాత్ర పేరిట రాష్ట్రంలో పర్యటించారు............ ఇంకా పర్యటిస్తున్నారు.....

స్వామి పరిపూర్ణానంద వారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించండి...
సత్యమేవ జయతే

4 comments:

  1. 14 సంవత్సరాల వయస్సులోనే, తల్లి కోరిక మేఱకు వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తూ సంతృప్తి చెందక, 16వ ఏట ఋషీకేశ్ చేరుకున్నరు.

    ReplyDelete
  2. Swami is great. Kancha ailayya is a mad dog

    ReplyDelete
    Replies
    1. నాన్నా! ప్రపచంలో ఉగ్రవాదులెప్పుడూ మతం ముసుగులో తిరుగుతూ, ప్రతిదానికీ జన్నాల్ని రెచ్చగొడుతుంటారు. పూర్ణం ఉగ్రవాది అని టీ వీ 9 చర్చలోనే మాలాంటీ మామూలు జనం కంఫార్మ్ చేసేసుకున్నారు. నువ్వు మహా మేతావివి అయ్యుంటావ్ మరి. Yes, poornam is a Terrorist

      Delete
    2. ఆయుధ పూజా విధానము :

      శ్రీ శ్రీ శ్రీ బ్రాహ్మణోత్తమ కవి కష్టేఫలి బ్లాగర్ శర్మ అన్నపూర్ణాదేవికి భక్తితో ఒక బ్లాగునందు పరమాన్నము నివేదించి, తన మరో బ్లాగులో రచించిన శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం అవధరింపుడు.

      ఓక అమ్మని లంజా అంటే,మరొక అమ్మ నీ అమ్మ లంజా, నీ అమ్మమ్మ లంజా, నీ నానమ్మ లంజా అని అన్నదట !

      దీనిని భక్తితో 108 పర్యాయములు పఠించినంతనే నిర్గుణోపాశ స్థితి కలుగునని తద్ బ్రాహ్మణుడు నుడివినాడు కనుక మీ బ్లాగునందు ప్రచురించుకుని ఆనందముతో తరింపుడు.

      Delete