Breaking News

1857 తరువాత పరిస్థితులు

స్వతంత్ర సంగ్రామం లో నాయకత్వం బలంగా ఉన్నన్ని నాళ్ళు ముస్లింల లో మేము వేరు అనే భావం లేదు. అందుకు తిలక్ ఒక సింహ స్వరూపుడు. అర్జీలు పెట్టుకునే కాంగ్రెస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని గర్జించాడు. పంజాబ్ కేసరి లాజపతి రేయ్ అలాంటి నాయకుడే. బెంగాల్ వరుస నాయకులతో ఉత్సాహం ఇస్తా వుంది. బంకించంద్రుడి నవల వందేమాతరం యువకులకు భగవద్గీత అయ్యింది. యువకులు అనేక మంది ఉద్యమం లో ఉత్సాహం తో పాల్గొన్నారు. బెంగాల్ విభజన ఆపడం విజయం గా కనపడు తుండేది.

తిలక్ ని 6 సంవత్సరాలు మాండలే జైలుకు పంపించారు ఆంగ్లేయులు. మళ్ళీ కొంత నిస్తబ్దత. చల్లారి పోయిన స్థితి. గోపాల కృష్ణ గోఖలే పగ్గాలు పట్టారు. అయన తిలక్ అంత ఉగ్ర స్వభావుడు కాదు. ఆయన చివర్లో దక్షిణాఫ్రికా లో ఉద్యమం నిర్వహించి వచ్చిన మొహన్దాస్ కరమ్చంద్ గాంధీని తన శిష్యుడుగా ప్రకటించాడు.
మధ్యలో ఇంగ్లిష్ వాడు పశ్చిమాసియా దేశ విద్రోహ చక్రవర్తుల గూర్చి గొప్పగా వ్రాసి, మన స్వదేశీ రాజులను సబ్ చాఫ్టర్లు చేసి హిందువులను తక్కువ చేసి, హిందూ ముస్లీమ్స్ ని ఆ విదేశీ చక్రవర్తులకు దగ్గర చేయడం, వారి వంశజులు గా వీరికి గౌరవం ఇవ్వడం లాంటివి చేసి ఉద్యమం లో ముస్లింల పాత్రను జాగ్రత్తగా దూరం చేసి ఒకే జాతీయుల మధ్య విభేదాలు నీతి అనుసరించారు. సిరియా, అరబ్బులు, ఇరాన్ ఇరాక్ నుండి వచ్చిన వారినందరినీ కలిపి మొహమ్మడన్ డైనాస్టీ అని, ఇక్కడి ముస్లీమ్స్ కి చుట్టరికం కలిపాడు. అనుకోని పెద్దరికం వారిని ఇంగ్లిష్ వారికంటే హిందువులే శత్రువులుగా భావించే వైపు పయనం సాగింది.
మద్రాస్ ప్రెసిడెన్సీ లో మరో సంఘటన జరిగింది. ఒక కలెక్టర్(ఆంగ్లేయడుి) వద్ద పనిచేసే బ్రాహ్మణుడు కలిసి ఉన్న చోటకు ఒక పెద్ద రైతు వచ్చి కలెక్టర్ కి సెల్యూట్ చేసి, ప్రక్కనుండే బ్రాహ్మణ గుమాస్తకు వంగి పాదాల కు నమస్కరించాడు. ఇది ఇంగ్లిష్ వాడికి ఆశ్చర్యం వేసి ఎందుకని అడిగితే మీరు రాజులు, వారు మా గురువులు అన్నారు. ఇంగ్లిష్ విద్య ప్రవేశ పెట్టడంతో, వేరే వృత్తి లేక బ్రతుక లేక ఉద్యోగం చేసే వాడికి పెద్ద రైతు ఇచ్చే గౌరవం చూసి ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ పటిిష్టంగా ఉన్నత కాలం వాళ్ళ ఆటలు సాగవని కులాల మధ్య చిచ్చు పెట్టటానికి ఎక్కువ, తక్కువలను సంస్కరించాలి అనే సాంఘిక కార్యక్రమాలు, అంటూ విడగొట్టడం, సతీ సహగమనం, విగ్రహ పూజ మన సామాజిక పద్దతుల పై విమర్శలు ప్రారంభించారు. అప్పటికే 800 సంవత్సరాల బానిసత్వం లో ఉన్న మనలో ప్రవేశించిన ఆత్మ న్యూనత మరియు బ్రిటన్ లో మన చదువుకున్న వారికి ఇంగ్లిష్ వాడు గొప్ప వాడనేచెప్పడం ప్రారంభం చేశారు.
తరువాతి స్వతంత్ర సంగ్రామం లండన్ లో చదువుకున్న వాళ్ళ చేతిలోకి పోయింది. సావర్కర్ లాంటి వారు గట్టిగా మాట్లాడినా కొన్ని విప్లవ కార్యక్రమాల్లో వారిని బర్మా లో జైల్లో ఉంచారు.
ఈ సమయంలో 1889 లో ఉగాది నాడు నాగపూర్ లో మరో స్వతంత్ర యోధుడి జననం వారే పూజనీయ కేశవ రావ్ బలీరాం హెడ్గేవార్. రాబోయే రోజుల్లో వారి చరిత రాస్తాను. చదువుతారు కదా!
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment: