Breaking News

1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (1857-1947 Freedom Struggle)

15 రోజుల్లోనే 51 వేల 316 ఆంగ్లేయులను చంపివేసారు.కేవలం 300 మంది ఆంగ్లేయులు బ్రతికి పోయారు.

మే 10,1857 న మీరట్ సైనిక శిబిరం లో విప్లవ కలకలం చెలరేగింది.ఆ రోజు ఆదివారం.ఆంగ్లేయులు చర్చ్ లో ప్రార్థన చేస్తున్నారు. ఆ చర్చ్ ని తగులపెట్టారు. ఒక ఆంగ్లేయున్ని కూడా ప్రజలు వదలిపెట్టలేదు.మీరట్ ప్రజలు తమ చేతుల్లో కొడవల్లు తీసుకుని ఆంగ్లేయులను మట్టుపెట్టారు.మీరట్ చుట్టు ప్రక్కల వున్న 40 గ్రామాల ప్రజలు ఈ యుద్ధం లో పాల్గొన్నారు..కాబట్టి ఇది సిపాయిల తిరుగుబాటు కాదు. ఆ తరువత 2000 మీరట్ సైనికులు,1500 ప్రజలు కలిసి దిల్లీ కి పయనమయ్యారు.దిల్లీ పాదుషా బహదూర్ షా జెఫర్ ని ఒప్పించి యుద్ధం లో దించారు. మీరట్ మరియు దిల్లీ సైనికులు రంగం లోకి దిగారు.50 వేల మంది సైనికులు పోగయ్యారు.11 వేల మంది ఆంగ్లేయులను ఒక్క రోజులను చంపివేశారు.దిల్లీని విముక్తి చేశారు. నానా సాహెబ్ పీష్వా,తాంతియా తోపే,ఝాన్సీ ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. దాంతో దిల్లీ,ఇటా,ఇటావా, బరేలి,మురాదాబాద్, రోహెల్ఖండ్,బెనారస్,అళాబాద్,కాంపూర్,అయోధ్య మరియు ఝాన్సీ మొదలైన ప్రాంతాలన్నీ ఆంగ్లేయుల చేతినుండి మన భారతీయ వీరులు గెల్చుకున్నారు. 15 రోజుల్లోనే 51 వేల 316 ఆంగ్లేయులను చంపివేసారు.కేవలం 300 మంది ఆంగ్లేయులు బ్రతికి పోయారు..అదీ ఎలా? 300 మంది కాషాయ బట్టలు వేసుకున్నారు.పకీర్ల వేషాలు వేసుకున్నారు.బొగ్గుతో శరీరాన్ని నల్లగా మార్చుకుని తప్పించుకున్నారు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. 1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (1857-1947 Freedom Struggle).

    ReplyDelete