Breaking News

1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (Freedom Movement)


4కొట్ల మంది భారతీయ ప్రజలు పాల్గొన్న 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని తక్కువ చెసి చూపటం మన అమరులైనవారిని అవమానించటమే అవుతుంది.

బ్రిటన్ లో ఆంగ్లేయ అధికారులు కూర్చుని చర్చించారు.పార్లమెంట్ లో వణకు పుట్టింది. బిల్వర్ ఫోర్స్ అనే అంగ్లేయుడు అంటాడు కద "ఒక్క భారతీయుడు 10 మంది ఆంగ్లేయులను మట్టుపెట్టగల శక్తివంతుడు.."" కాబట్టి భారత్ ని గెలవటం కష్టం అంటాడు.మరి ఎలా? అప్పుడు బ్రిటిష్ కి మద్దతు ఇచ్చే రాజులు,అధికారులు,జమిందారులు,జాగిర్దారులు,వ్యక్తులు భారత్ లో ఎవరెవరున్నారో జాబితా రాసారు.విభజించు పాలించు నీతిని అనుసరించి భారత్ ని గెలవాలని తీర్మానించారు. సింధియాలు,నిజాం రాజులు,జునాగఢ్ రాజులు,పంజాబ్ రాజులను ఆశ పెట్టి,ప్రలోభపెట్టి, మన ప్రజల మధ్య చిచ్చు పెట్టారు.. 3 లక్షలు భారతీయులు ,64 వేల బ్రిటిష్ సైనికులు కలిసి మన దేశం పై యుద్ధం ప్రకటించారు.

మే 10 నుండి సెప్టెంబర్ 29 వరకు 350 జిల్లాల్లో ఎక్కడా ఆంగ్లేయుల ఝండా లేదు.అందరినీ చంపివేశారు..కాని మన మధ్య వున్న కలహాలను సృష్టించి భారతీయులను చిత్రహింస లు పెట్టారు. అయినా 8 నెలల వరకు నిరంతరంగా ఆపకుండా యుద్ధం చేసిన వీరుడు తాంత్యా తోపే.

ఝాన్సీ లక్ష్మీ బాయి ఆంగ్లేయులను పదే పదే ఓడించింది.

బిటూర్ అనే ప్రాంతం లో నివసిస్తున్న నానా సాహెబ్ పీష్వా మరో ప్రక్కన యుద్ధానికి నేత్రుత్వం వహించాడు..మొత్తం దేశం లో 4 కోట్ల మంది ప్రజలు వీరి నాయకత్వంలో పాల్గొన్నారు. ఇంత మంది ప్రజలకి 4 లక్షల మంది నాయకులు వున్నారు.రాణి అవంతిబాయి,రాని గజమాల, అజీముల్ల,షౌకత్ అలీ వంటి దేశభక్తులు ఈ పోరాటం లో పాల్గొన్నారు..మస్జిద్ లల్లో కూడా అజాన్ చెప్తూ నే ఈ పోరాటానికి ముస్లిం లు పూర్తిగా మద్దతిచ్చారు.అరుణా అసఫలీ,హజ్రత్ మహల్ వంటి 4 వేల మంది మహిళలు పాల్గొన్నారు..అజీజన్ బాయి వంటి వేశ్యలు కూడా ఆంగ్లేయులతో యుద్ధం చేసారంటే 1857 విప్లవం ఎం త ప్రాముఖ్యత కలిగిందో మీరు అర్థం చేసుకొండి.

4కొట్ల మంది భారతీయ ప్రజలు పాల్గొన్న 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని తక్కువ చెసి చూపటం మన అమరులైనవారిని అవమానించటమే అవుతుంది.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. 1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (Freedom Movement).

    ReplyDelete