Breaking News

1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (Anna Saheb Patvardhan)


అన్నాసాహెబ్ పట్వర్ధన్ 4 మే 1847 న మహరాష్ట్ర లో జన్మించాడు..ఆ ప్రాంతంలో మొట్టమొదటి సమర యోధుడు.లా చదివాడు.గ్వాలియర్ కి చెందిన రావ్ రాజా దినకర్ రావ్ రజ్వాడే అనే రాజు ఆంగ్లేయులకు మద్దత్తిచ్చినప్పుడు, పట్వర్ధన్ నేరుగా వెళ్ళి,ఆయనను కలిసి,దేశానికి ద్రోహం చేయటం సరియైనదేనా అని ప్రశ్నిస్తాడు.నీ లాభం కొసం,స్వార్థం కోసం వైదిక నాగరికత తొ వెలుగుతున్న సంస్కృతిని నాశనం చేసే విదేశీయులతో చేతులు కలుపుతావా? నేను ఒక లా విద్యార్థిని. ఆంగ్లేయులకు ఊడిగం చేయడానికి సిద్దపడిన రాజు ని చూద్దామని వచ్చానంటూ పరిహాసం చేసి వెళ్తాడు. ఆశ్చర్యం ఆ తరువాత కాలం లో ఆ రాజు , పట్వర్ధన్ కి స్వాతంత్ర్య పోరాటం లో పూర్తిగా సహకరిస్తాడు.

మొదటగా ఆయుధాలు ధరించిన పోరు సల్పుతున్న వీరుడు వాసుదేవ్ బలవంత ఫడ్కే కి వెన్నుదన్ను గా తోడు నిలుస్తాడు పట్వర్ధన్.

దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ ఫ్యాక్టరీ ని ప్రారంభిస్తాడు.పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుడతాడు.ఇంగ్లిష్ వారికంటె తక్కువగా ఉత్పత్తులను అమ్ముతూ మార్కెట్లో ఆంగ్లేయులకు వణకు పుట్టిస్తాడు.

దేశభక్తుల రక్త హృదయాల తో స్వేచ్చా వృక్షము తడుస్తూ వికసిస్తుందంటూ వ్యాఖ్యానిస్తాడు.

ప్రపంచంలోని ఇటలీ,అమెరికాల్లో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వీరుల కథలను పరిశీలిస్తాడు.ప్రేరణ పొందాడు.

పట్వర్ధన్ పాండిత్యానికి మెచ్చి బరోడా మహరాజు ఇతనికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వచూపుతాడు.కాని పట్వర్ధన్ తిరస్కరిస్తాడు..స్వతంత్ర్య పోరాటానికి అడ్డంకిగా నిలుస్తుందని భావిస్తాడు.

తన జన్మస్థానమైన బేరర్ (మహరాష్ట్ర ) బ్రిటిష్ వాళ్ళనుండి స్వాధీనం చేసుకోవడానికి నిజాం సంస్థానం లోని సాలార్ జంగ్ దివాన్ సహాయం కోసం ప్రయత్నిస్తాడు.

తన జీవితకాలం దేశం కోసమే జీవించిన అమరుడు అన్నాసాహెబ్ పట్వర్ధన్.
- అప్పాల ప్రసాద్

1 comment:

  1. 1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (Anna Saheb Patvardhan).

    ReplyDelete