Breaking News

ఎస్.జడ్. ఖాసిమ్ (Syed Zahoor Qasim)

జననం :31 డిసెంబరు 1926

డా.ఎస్.జెడ్.ఖాసిమ్ పద్మభూషణ్ సయ్యద్ జహూర్ కాసిం (జననం డిసెంబరు 31, 1926 అలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారత్) ఒక భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త. 1981 నుండి 1988 వరకు భారత అంటార్కిటికా యాత్రా పరిశోధనలకు నాయకత్వం వహించాడు.ఇతడు 1991 నుండి 1996 ప్లానింగ్ కమీషన్ సభ్యుడు. కాసిం, అనేక విశ్వవిద్యాలయాలలో గౌరవ ప్రొఫెసర్, ఉదా. అలీఘర్ ముస్లిం యూనివర్సిటి, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం , అన్నామలై విశ్వవిద్యాలయం , ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు , మరియు జామియా మిలియా ఇస్లామియా. డిసెంబరు 1981 లో ప్రథమ భారత అంటార్కిటికా యాత్రకు అధిపత్యం వహించాడు. జాతీయ సముద్రాల శోధనాకేంద్రం (NCAOR) తరపున వెళ్ళాడు. అంటార్కిటికా ఖండంలో భారత కేంద్రాలైన దక్షిణ గంగోత్రి మరియు మైత్రి ల ఏర్పాటుకు మరియు నిర్వహణకు కఠోరకృషిచేశాడు.

పురస్కారాలు
1974: పద్మశ్రీ

1975: చంద్ర హోరా మెమోరియల్ పతకం

1975: గోల్డెన్ జూబిలీ ట్రస్టు బంగారు పతకం

1982: పద్మభూషణ్

ఎఫ్.ఐ.ఇ. ( F.I.E.) పురస్కారం.

1 comment:

  1. భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త ఎస్.జడ్. ఖాసిమ్.

    ReplyDelete