Breaking News

ప్రజాస్వామ్యంలో యజమానికి ఉండవలసిన లక్షణాలు


ప్రజాస్వామ్యంలో యజమానికి(ప్రజలకు) ఉండవలసిన లక్షణాలు:

1. నిర్ణయించే అధికారం ఉండాలి.
2. పర్యవేక్షణ అధికారం ఉండాలి.
3. లాభా, నష్టాలలో వాటా ఉండాలి.

నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక యజమాని ఉండేవాడు. అతని పనులు చూసుకోడానికి ఒక పని వాడిని నియమించాడు. ఆ పనివాడి పని ఏంటంటే ప్రతీ రోజు ఒక లీటరు పాలను వేడి చేసి యజమానికి ఇవ్వటం. ఆ పని వాడు కూడా రోజు పాలు ఇస్తునేవున్నాడు. కొద్దిరోజుల తరువాత ఆ ఒక లీటరు పాలలో నీటిని కలిపి యజమానికి ఇచ్చేవాడు, మిగిలిన పాలను ఆ పనివాడు తాగేసేవాడు. ఒక రోజు ఒక వ్యక్తీ యజమాని దగ్గరకు వచ్చి మీ పని వాడు పాలల్లో ఏదో కలిపి మోసం చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు యజమాని ఓహో అదా విషయం అని ఆ పని వాడిని గమనించడానికి ఇంకో పని వాడిని నియమించాడు. అప్పుడు ఆ పనివాల్లిదరు ఒకటైపోయారు. ఆ తరువాత ఆ ఇద్దరు కలిసి చెరో పావు లీటరు త్రాగటం మొదలు పెట్టారు.మిగిలిన పాలల్లో నీటిని కలిపి యజమానికి ఇచ్చేవారు. ఆ తరువాత కొన్ని రోజులకి కొంతమంది యజమాని దగ్గరుకు వచ్చి మీరు త్రాగే పాల్లల్లో మీ పనివాళ్ళు నీళ్ళను కలుపుతున్నారు అని చెప్పారు. అప్పుడు ఆ యజమాని ఇంకో పని వాడిని నియమించి "ఈ ఇద్దరిని గమనించు అని చెప్పాడు". 

ముగ్గురు ఒకట్టైయారు, ఇప్పుడు ముగ్గురు పావు పావు లీటరు త్రాగటం మొదలు పెట్టారు.యజమానికేమో పావు లీటరు పాలల్లో 3 పావుల నీటిని కలిపి ఇచ్చారు. కొన్నిరోజులకి యజమాని సన్నబడుతూ వచ్చాడు. కొంతమంది ఆయన్ని చూసి మీరు సన్నబడ్డారు ఏంటి అని అడిగారు.మీరు బాగా బలహీనంగా అయిపోతున్నారు, మీ పనివాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని ఈ ముగ్గుర్ని గమనించడానికి ఇంకో పని వాడిని నియమించాడు. నలుగురు పని వాళ్ళున్నారు పాలు ఒక లిటరే. కొద్దిరోజులకి ఆ నలుగురు పనివాళ్ళు కలిసి ఆ పాలు త్రాగటం మొదలుపెట్టారు. నలుగురు నాలుగు పావులు త్రాగేసారు. యజమానికి పాలు ఇవ్వటం మానేసారు. యజమాని నిధ్రపోయిన తరువాత అతని మూతికి మీగడ రాసేసేవాళ్ళు. మరుసటిరోజు ఉదయమే నిద్రలేచిన యజమాని పని వాళ్ళని పిలిచి నాకెందుకు పాలు ఇవ్వలేదు అని అడిగారు. అప్పుడు ఆ పని వాళ్ళు పాలు మిరే త్రాగేసారు, అద్దాన్ని చూపించారు. మీ ఆరోగ్యం పడుఅవ్వటానికి కారణం మీ అజిర్తే అని చెప్పారు.

ఈ కథలో యజమాని ప్రజలు. పని వాళ్ళు  అవినీతిలో మునిగిన MLA లు, MP లు, ప్రభుత్వ అధికారులు.

ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి.

ప్రజలు మేల్కొనకపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు. ప్రభుత్వం చేత పని చేయిన్చుకోవాల్సిందే మనమే.

జై హింద్.
- సాయినాథ్ రెడ్డి.

6 comments:

  1. ప్రజాస్వామ్యంలో యజమానికి ఉండవలసిన లక్షణాలు.

    ReplyDelete
    Replies
    1. As long as people going by caste, religion, expecting money from ideotic politicians,?it will be like this only.

      Good example by you , but could have add required skills of reality ... Especially to public

      Delete
  2. భారతీయుడుSeptember 7, 2014 at 2:02 PM

    నేటి ప్రజాస్వామ్యాన్ని ఒక కథలో చక్కగా వివరించారు.

    ReplyDelete
  3. the Story of common man of india.

    ReplyDelete