Breaking News

కొమర్రాజు అచ్చమాంబ

జననం: సెప్టెంబర్ 6, 1906-గుంటూరు
మరణం: 1964



కొమర్రాజు అచ్చమాంబ (1906-1964) ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి విశేష కృషి చేసింది. విద్యార్థి దశనుండి అనేక జాతీయోద్యమాలలో పాలు పంచుకున్నది. ఆవిడ కొమర్రాజు లక్ష్మణరావు పుత్రిక.

అచ్చమాంబ చరిత్రకారుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, ఆయన భార్యకు 1906, సెప్టెంబరు 6న గుంటూరులో జన్మించింది. విద్యార్థి దశనుండే జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నది. 1924 లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశాలలో బాలికా సేవాదళానికి నాయకురాలిగా పనిచేసింది. 1928 లో మద్రాసు నగరంలో సైమన్ కమీషన్‌కు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనకు నాయకత్వం వహించింది. 1943 నుండి 1948 వరకు భారతీయ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా ఉన్న అచ్చమాంబ, 1948లో సైద్ధాంతిక విభేదాల వలన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెసులో చేరింది. 1957 లో కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా విజయవాడ నియోజకవర్గం నుండి రెండవ లోకసభకు ఎన్నికయ్యింది.

అచ్చమాంబ సాంప్రదాయకంగా పిల్లల పెంపకంలో వస్తున్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉద్దేశించి తెలుగులో ప్రసూతి – శిశుపోషణ అన్న పుస్తకాన్ని వ్రాసింది. ఈమె 1946 లో ఆంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన "మహిళ" అనే స్త్రీల కొరకు ఉద్దేశించబడిన మాసపత్రికకు సంపాదకత్వం వహించింది. అయితే ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలువడింది. 1940లో ఈమెకు వి. వెంకటరామశాస్త్రితో వివాహమైంది. దంపతులకు టాన్యా అనే ఒక కుమార్తె జన్మించింది.

2006 లో, ఈమె శతజయంతి ఉత్సవాలను హైదరాబాదులో జరుపుకున్నారు.

5 comments:

  1. కొమర్రాజు అచ్చమాంబ.

    ReplyDelete
  2. స్వాతంత్ర్య సమరంలో మహిళల పాత్ర చాలా తక్కువ అని అనుకుంటారు అందరు. కాని, చాలా మంది మహిళలు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. అచ్చమాంబ గురించి అతి తక్కువ మందికి తెలుసు. మీ ద్వారా ఆ సంఖ్య పెరుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాద్ నరేష్ గారు.

      Delete