మన పూర్వీకుల పరిజ్ఞానం లోని ఒక మచ్చుతునక చదవండి
27 పెద్ద పెద్ద నక్షత్రాలను మన వాళ్ళు అనాడే గుర్తించారని చదివాము కదా...ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం పేరు 'జ్యేష్ట ' ...జ్యేష్ట అంటే అర్థం..పెద్దది అని..నిజంగా కూడా అది అన్ని నక్షత్రాలలోకెల్లా చాలా పెద్దది. అది 18వ నక్షత్రం.పురాతనమైనది.ప్రకాశవంతమైనది. ఈ విషయాన్ని ఎలా చెప్పగలిగారు..అదీ టెలీస్కోపులు లేని కాలంలో...ఎలా సాధ్యమైంది?
ఇంకో విషయం తెలుసా..
వివాహం తరువాత కొత్త దంపతులను పందిరి బయటకు తీసికెల్లి ఆకాశం వైపు చూపిస్తూ అరుంధతి-వశిష్టుల నక్షత్రాలను చూపిస్తారు.వాళ్ళిద్దరు ఆదర్శ భార్యాభర్తలు గా భావించాలని..చెపుతారు..అయితే ఆ రెండు నక్షత్రాల్లో ఒక నక్షత్రం కదలకుండా వుంటుంది.మరొకటి దాని చుట్టూ తిరుగుతుంది(భార్యా భర్తలు అన్యోన్యంగా వుండటానికి సంకేతం అది). మన పెద్దలు ఇది ఎలా కనిపెట్టారు?
అందుకీ చెప్పేది..ఇప్పటి నీ చదువులతో వాటిని పోల్చుకొమ్మని....
జీవితమంతా పరిశోధనలతో,అన్వేషణలతో కాలం గడిపి,ముందు తరాల వారికి మేలు చేయాలనుకున్న మన పూర్వీకులా విద్యావంతులు?
- అప్పాల ప్రసాద్.
మన పూర్వీకుల పరిజ్ఞానం లోని ఒక మచ్చుతునక చదవండి
ReplyDelete