Breaking News

భారతీయుల చేతుల్లోనే ఆర్ధిక వ్యవస్థ ఉంది

ఏవి స్వదేశీ,ఏవి విదేశీ వస్తువులో తెలుసుకొని స్వదెశీ వస్తువులను వాడటం మొదలు పెట్టాలి.1991 కంటే ముందుగానె శ్రీ దత్తొపంత్ ఠేంగ్డీ ఈ పరిస్తితి ముందుగానే వూహించి స్వదేశీ ఉద్యమం జరగాలని ఆశించారు.దాని పరిణామాలు నేడు అందరు చూస్తున్నాము.రూపాయి పతనం తరువాత నేడు అన్ని పత్రికలు,ఇంగ్లీష్ పత్రికలు కూడా స్వదేశీ వస్తువులని వాడాలని వ్యాసాలు వ్రాస్తున్నాయి.వస్తువుల జాబితా కూడా ప్రచురించాయి.కొన్ని చోట్ల వస్తువుల పేర్లు తప్పులు దొర్లాయి.అయినాప్పటికినీ ఈ రొజు అందరు గుర్తిన్స్తున్న ఈ కఠొర సత్యాని,నిప్పులాంటి నిజాన్ని అందరూ అంగీకరించి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలి.నలుగురు ఆర్థిక వేత్తలు కాదు మన ఆర్థిక వ్యవస్థ మన భారతీయుల చేతుల్లో వుందని నిరూపించాలి.

1952లో మొదటిసారి మనదేశం విదేశాల నుండి అప్పు తెచ్చ్చింది. అంతకుముందు ఎవరినీ అప్పు అడగలేదు.మనకు అప్పు ఇచ్చే దేశాలు మనపై ఎన్నో షరతులు విధించారు.ఆ షరతుల్లో మొదటిది మనం ఏ కరెన్సీ లొ అప్పు తీసుకుంటామో ,ఆ కరెన్సీ విలువ పెరగాలి .అంటే డాలర్లలో అప్పు తీసుకుంటాం కాబట్టి డాలర్ విలువ పెరగాలి.. రూపాయి విలువ తగ్గాలి. దానికోసం 1952లొ అప్పు తీసుకునే ముందు రూపాయి విలువ 1డాలర్ కి 7రూపాయిలు చొప్పున తగ్గించి,అప్పు తీసుకున్నారు.1957లో మళ్ళీ అప్పు తీసుకున్నాం.ఆ తరువాత 62లొ,68లొ,72లొ,77లొ,82లొ అప్పు తీసుకుంటూ 82 నుండి ప్రతి సంవత్సరం అప్పు తీసుకోవటం మొదలుపెట్టాం.వెదీశాల నుండి తెచ్చిన అప్పును తీర్చడానికొసం మళ్ళీ మళ్ళీ అప్పు తీసుకునే ప్రధానులు వచ్చారు.దేశీ, విదేశీ అప్పు కలుపుకుని 36 లక్షల్ కోట్ల రూపాయల అప్పు వుంది.అంటే ప్రతి భారతీయుడి పైన 36000 రూపాయల అప్పు వుందన్నమాట.1డాలర్ విలువ 70 రూపాయలు కాబోతున్నది.ఏ దేశాలనుంది అప్పు తీసుకున్నామో ఆ దేశాల కంపనీలు మన దేశంలొ వచ్చి పెత్తనం చేయడానికి మన ప్రభుత్వాలే అనుమతిచ్చాయి.దాంతో మనం విదేశీ వస్తువులు కొంటూ వస్తున్నాం.అవి లాభాలు గడించి తమ దేశాలకు తరలిస్తున్నయి.దాంతో మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.
- అప్పాల ప్రసాద్.


స్వదేశీ వస్తు జాబితాను డౌన్లోడ్ చేయటం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ వస్తు జాబితాను ప్రింట్ తీసుకుని మీ ఇంట్లో సాధ్యమైనంత వరకు స్వదేశీ వస్తువులను వాడటానికి ప్రయత్నం చేయండి.

- సాయినాథ్ రెడ్డి.

7 comments:

  1. భారతీయుల చేతుల్లోనే ఆర్ధిక వ్యవస్థ ఉంది.

    ReplyDelete
  2. సూపర్. ఈ ఆలోచన చాలా బాగుంది. అందరు లిస్టు ను డౌన్లోడ్ చేసుకోండి.

    ReplyDelete
  3. ఇటువంటి లిస్టు న్యూస్ పేపర్స్ లో వేస్తే ఎక్కువ మందికి చేరుతాయ్.

    ReplyDelete
    Replies
    1. పేపర్ వాళ్ళు వెయ్యరు. ఎందుకంటే ఈ లిస్టు లో విదేశీ కంపెనీలు ఉన్నాయ్ కదా. మరి ఈ లిస్టు వేస్తే news పేపర్ వాళ్ళకి యాడ్స్ రావు. అందుకని వాళ్ళు వెయ్యరు. మీరు మీ స్నేహితులందరికీ పంపండి. వాళ్ళని ఇంకొంతమందికి పంపమని చెప్పండి. ఇలానే సాధ్యం ఎక్కువ మందికి అందాలంటే.

      Delete
  4. వాళ్ళకి డబ్బు వచ్చేదే యాడ్స్ వల్ల.

    ReplyDelete
  5. ప్రధాని స్వాతంత్ర్యం రోజున చెప్పారు కదా, భారతీయులందరూ 90 రోజులు కేవలం స్వదేశీ ఉత్పత్తులే వాడితే తరువాత వారికీ విషయం ఏంటనేది అర్ధం అవుతుంది...

    ReplyDelete