Breaking News

ఆధునిక యుగంలో భారతీయ మహిళ-6

ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరు సమానమా?


ఆధునికత అంటే పైపైన వేషాలు వేయటం,ఇంగ్లీష్ మాట్లాడటం కాదు.డిగ్రీ,ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పొందటం కాదు.మరి?

శాస్త్రీయ దృక్పథం,సత్యాన్వేషణ,వాస్తవ ప్రపంచంలో జీవించే అలవాటు చేసుకోవటం,అహంకారినికీ తావు లేకుండా,అందరినీ ప్రేమించటం, నటన, వంచన కాదు.కలిసి జీవించటమే శాస్త్రీయత.దురాచారాలు,మూఢనమ్మకాలను వ్యతిరేకించటం .ఆధునికత.
మహిళలు కాలేజీల్లో చదువుతూ,ఉద్యోగాలు చేస్తూ కూడా ఆడతనాన్ని కాపాడుకుంటూ,ఇతరులకు రోల్ మాడల్ గా వుండాలి.ఇంగ్లిష్ విద్య పేరుతో పాశ్చాత్య ప్రభావానికి లోనయ్యి,ఇతర మహిళలు ఏ డ్రెస్స్ వేసుకుంటే అదే ధరించాలని,లేకపొతే ఏమనుకుంటారోనని భావించే బాలికల సంఖ్య పెరుగుతున్నది.
మహిళలను ఉద్దేశించి, పురుషులు "నీవు ఎంత అందంగా వున్నావో" అంటూ చేసే వ్యాఖ్యనాలను అనుమతించకూడదు. అందం విషయంలో అడిగే హక్కు మగవాడికి ఎక్కడిది? స్వామి వివెకానంద చెప్పినట్లుగా 'భారత్ లో తన భార్య తప్ప,ఇతర మహిళలను తల్లిగా భావిస్తారని, విదేశాల్లో 'తన తల్లిని తప్ప ఇతర మహిళలను గర్ల్ ఫ్రెండ్స్ గా భావించటం జరుగుతున్నదని ' అన్నారు.
అలాగే స్వామిజీ ఇంకో సందర్భంలో ' మీకు వున్న మేధస్సు మా భారతీయ మహిళలకు వుండాలని, అయితే ఆ మేధస్సు కోసం తన పవిత్రతను,శీలాన్ని ఫణంగా పెట్టకూడదని భారతీయ మహిళలు భావిస్తారని ', చెబుతాడు.
ఎందుకంటే మేధస్సు పేరుతో, విద్యార్జన పేరుతో ఇన్నేళ్ళు గడిచిన తరువాత కూడా, మహిళలపై నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? భధ్రత ఎందుకు కరువైతున్నది? విడాకుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నవి? తన సుఖం కోసం ఇతరులపై అత్యాచారాలు ఎందుకు చేస్తున్నారు? స్త్రీని ఒక ఇండివిజువల్ గా,అంటే ఒక ప్రత్యక వ్యక్తిగా,వస్తువుగా భావిస్తున్నందు వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి.
ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరు సమానమా? మన ధర్మంలో ఈ ప్రశ్న ఉదయంచదు.ఎందుకంటే ఇద్దరూ ఒకటే..అంటే ఇద్దరిలో భగవంతుని అంశ వుంది. పాశ్చాత్య విద్య చదివినవారికి ఇది తొందరగా అర్థం కాదు.ఎప్పుడు అర్థమవుతుంది? పండుగలప్పుడు,నోములు,వ్రతాలు,పెళ్ళిళ్ళు,ఇంట్లొ శుభకార్యాలు జరిగినప్పుడు..సెలవుల్లో కుటుంబ సభ్యులంతా ఒక్కటై కలిసి ఆనందంగా వుంటున్నప్పుడు..స్త్రీ పాత్ర,ఆమె యోగదానం,ప్రేమ,ఆత్మీయత,సమరసత,సమభావంతో ఆమె చేసే పనులు స్పష్టంగా కనపడుతాయి.

మహిళలు,పురుషులు అందరూ తెలుసుకోవలిసిన అంశాలు..
*ఆడతనం కోల్పోవద్దు..
*ఆడతనం రక్షించుకోవాలి.
*'గృహిణి ' అని చెప్పుకోవటానికి సిగ్గు పడొద్దు.
*పురుషులకు లేని దివ్యశక్తి తమకు వుందనీ,సంతానోత్పత్తికి అది తోడ్పడిందని,అది ప్రకృతి తమకు ఇచ్చిన వరమని భావించాలి.
*కుటుంబ వ్యవస్థ బలంగా తీర్చిదిద్దాలి.
*పొదుపు,త్యాగం .విశాల భావన ..ఇవి ఆడవారి స్వావలంబన,స్వాభిమానానికి చిహ్నం.
*జిజియామాత-శివాజీ,భువనేశ్వరి-వివేకానంద,జయవంతిబాయి-రాణాప్రతాప్,సునీతి-ధృవుడు,పార్వతి-గణపతి ఇలా ఇంక ఎన్నో ఈ యుగంలోని ఉదాహరణలు మన జీవితాలకు ఆదర్శం కావాలి.
*ఆడవాళ్ళలో వున్న ఈ అంత:శక్తిని గుర్తించి,మగవారికి కూడ తెలియ చేయాలి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. ఆధునిక యుగంలో భారతీయ మహిళ

    ReplyDelete