Breaking News

సంపూర్ణ స్వతంత్ర్యము (పూర్ణ స్వరాజ్)


భారతీయులు 1928 మేలో సైమన్ సంఘం (సైమన్ కమీషన్) యొక్క సిఫార్సులను తిరస్కరించి బొంబాయిలో సర్వ పక్ష సభను నిర్వహించారు.ప్రజలలో బ్రిటీష్ పాలనపై వ్యతిరేకతను పెంపోందించటం ఈ సభ ముఖ్య ఉద్దేశం.ఈ సభ భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ముసాయిదా సంఘాన్ని నియమించింది. కాంగ్రెస్ కలకత్తా సమావేశాలలో 1929 డిసెంబర్ లోగా బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశానికి స్వపరిపాలన హోదా నివ్వాలని లేదా దేశ వ్యాప్తంగా సత్యాగ్రహాని ప్రారంభిస్తామని తీర్మానించింది.ఆయితే 1929 కల్లా పెరిగిన రాజకీయ అసంతృప్తి, ప్రాంతీయ ఉద్యమాలలో పెరిగిన హింస కాంగ్రెస్ నాయకులలో సంపూర్ణస్వరాజ్యం కోరకు పిలుపునివ్వాలనే కోరికను పెంచాయి. జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929లో జరిగిన చారిత్రాత్మక లాహోర్ సమావేశం సంపూర్ణ స్వాతంత్ర్యమునకు పిలుపునిచ్చింది. 1930 జనవరి 26న భారతదేశంమెత్తం సంపూర్ణ స్వాతంత్ర్యదినంగా పాటించాలని నిర్ణయించింది. భారత దేశంలోని వివిధ రాజకీయపక్షాలు,విప్లవకారులు సంపూర్ణ స్వతంత్ర్యదినోత్సవాన్ని సగర్వంగా,సగౌరవంగా జరుపుకోవటానికి ఒక్కటైనారు.

1 comment:

  1. సంపూర్ణ స్వతంత్ర్యము (పూర్ణ స్వరాజ్)

    ReplyDelete