Breaking News

జి.ఎం.సి.బాలయోగి

జననం :జి.ఎం.సి.బాలయోగి 1951 అక్టోబర్ 1-తూర్పు గోదావరి జిల్లా,యెదురులంక
మరణం :2002 మార్చి 3-కృష్ణా జిల్లా కువ్వడలంక
మరణ కారణము :హెలికాప్టరు ప్రమాదం


గంటి మోహనచంద్ర బాలయోగి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్.

బాలయోగి 1951 అక్టోబర్ 1 న తూర్పు గోదావరి జిల్లా యెదురుగన్నయ్య మరియు సత్యమ్మ లంక గ్రామములో గంటి దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు.

2002 మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపము వలన హెలికాప్టరు ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామము సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాడు.

నిర్వహించిన పదవులు:
1987 - 1991 తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు.

1991 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.

1996 - 1998 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి.

1998 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.

1998 మార్చి 24 - 2002 మార్చి 3 లోక్‌సభ స్పీకర్.

1999 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.


వేమగిరి(తూ.గో.జిల్లా)లో జి.ఎం.సి.బాలయోగి విగ్రహం.

1 comment:

  1. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన లోక్‌సభ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ సభాపతి జి.ఎం.సి.బాలయోగి.

    ReplyDelete