Breaking News

ఓ భారతపుత్రా వాస్తవాన్ని తెలుసుకో - 2



మన ప్రాచీనుల సులభ సూత్రాలలో ఒక సూత్రమే నేటి పైథాగరస్ సిద్థాంతమని గుర్తు పెట్టుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. శున్యాంకానికి (సున్నాని) ప్రవేసపెట్టింది భారతీయులే కదా. క్రీ.శ. 1వ శతాబ్దం తరువాత భారతీయ శాస్త్రవిజ్ఞానం విదేశీయుల ఆక్రమణల వల్ల ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. పోర్చుగీసువారు, డెన్మార్క్ వారు, ఫ్రాన్స్ వారు, బ్రిటిషు వారు మనదేశాన్ని ఆక్రమించడం, ఆ సమయంలో ఐరోపాలో విజ్ఞానశాస్త్రం క్రొత్త రూపాలను ధరిస్తూ ఉంటే, మన దేశం యుద్దాలతో, ఆక్రమణలతో తల్లడిల్లిపోయింది.

అదేమీ దురదృష్టమో మన ఆత్మవిశ్వాసం అహంకారంగా పరిణమించింది. అను శాసనారాహిత్యం, అసూయ అనే అసురులు విజ్రుంభించి ఐక్యతను, ఏకాత్మతను స్వాహ చేశారు. దీనితో దురాక్రమణదారులను ఎదుర్కొనే సామర్ధ్యం భారతీయులలో లోపించింది. ఆవిధంగా ఈ పవిత్రభూమి విదేశీ పాలనలో నానా అవస్థలు పడింది. తమ పూర్వవైభవాన్ని, సింహసదృశ పరాక్రమాన్ని విస్మరించిన భారత ప్రజలు బానిస మనస్తత్వానికి లోనయ్యారు.

ఈనేల మీద నడయాడుతూనే మనం ఎక్కడో ఏ ఆకాశంలోనో స్వర్గంలోనో ఉండే కనిపించని దేవతాగణాలను ఆరాధించటం మొదలుపెట్టాము. మన ధర్మం యొక్క ప్రాతిపదికనే మనం కోల్పోయాము. విషమిస్తున్న ఈ పరిస్థితులను గమనించిన స్వామి వివేకానంద సకాలంలో ఇలా హెచ్చరించారు. "ప్రస్తుతానికి ఇతర దేవతలందరినీ ప్రక్కన పెట్టండి. రాబోయే 10 సంవత్సరాలు భారతమాతనే మీ ఆరాధ్యదేవతగా స్వీకరించండి".

స్వాతంత్ర్యం సిద్ధించాక మనదేశంలో శాస్త్ర విజ్ఞానం జీవం పోసుకోవడం ఆరంభించింది. మన శాస్త్రవైభావాన్ని గురించి, మన ప్రాచీన శాస్త్రవేత్తల గురించి, మన చరిత్రకే వన్నె తెచ్చిన ఆ మహనీయుల జీవితాలను గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. తెలుసుకుని ఆచరణకు సాధ్యమైయేవి ఆచరణలో పెట్టాలి. ఆసక్తికరమైన ఆలోచనలు ఆరోగ్యకరమైన భావనలు దరిచేరి సమాజ శ్రేయస్సు పట్ల మన బాధ్యత ఏమిటో సామాన్యులకు సైతం స్పష్టంగా తెలిసేటట్లు చేయగలుగుతాయి.


మన పూర్వికులు, స్వాతంత్ర్యం కొరకు చిందించిన రక్తాన్ని వృధా కానియకండి. మన దేశ పూర్వ వైభవాన్ని పునరుద్దరించేందుకు చైతన్యవంతులు కండి. 

స్వామి వివేకానంద చెప్పినట్లు, "మనమందరం శ్రమపడి పనిచేద్దాం. ఇది నిద్రపోవడానికి సమయం కాదు. భావి భారతోదయం మన చేతులపై ఆధారపడి ఉంది. ఆ తల్లి సంసిద్ధంగా వేచిఉంది. లెండి! మేల్కోండి !! అదిగో శాశ్వతమైన ధర్మసింహాసనంపై నవయవ్వనంతో పుర్వంకంటే దేదిప్యమానంగా వెలుగుతూ ఆసీనురాలై ఉన్న మన భరతమాతను చుడండి". 

జై హింద్.


- సాయినాథ్ రెడ్డి.

7 comments:

  1. facts about INDIA. Thanks for this valuable information

    ReplyDelete
    Replies
    1. ధన్యవాద్ సునీతా గారు.

      Delete
  2. Replies
    1. థాంక్స్ వికాస్ గారు.

      Delete
  3. గొప్పగా ఆలోచించే వ్యక్తులకు ఎప్పుడూ గొప్ప ఆలోచనలే వస్తాయి. చాలా బాగా రాసారు సాయి గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నరేష్ గారు.

      Delete