Breaking News

Vande Mataram Full Song Lyrics in Telugu

పల్లవి:

వందే మాతరం 
వందే మాతరం
వందే మాతరం
వందే మాతరం
తల్లీ మా వందనం 


చ 1 :
చల్లని వెన్నెల కాంతులతో
తెల తెల్లని పువ్వుల సుగంధాలతో 
శోభనందజేసే, మమ్ముల పరవశింపజేసి,

కిల కిల రవముల నవ్వులతో
చిరు చిరు జల్లుల పలుకులతో
సుఖాల నిచ్చే వరాల మా తల్లీ!!

గల గల పారే జలపాతం 
నోరూరించే ఫలాల మధురం
మలయ మారుతం వీచే
సస్య శ్యామలం...

సుజలాం సుఫలాం మలయజ శీతలాం 
సస్య శ్యామలాం వందేమాతరం (1)

వందేమాతరం (4 సార్లు )
తల్లీ మా వందనం 


!!చ!! 2 
కోటి కోటి కంఠాలు పలికినవి 
కోటి కోటి ఖడ్గాలు లేచినవి   
ఎదలో సవ్వడి వందేమాతరం

ఎవరన్నారు అబలవని 
నీవే బహుబల ధారిణివి 
రక్షకురాలివి -రిపు సంహారిణివి..  

గల గల పారే జలపాతం 
నోరూరించే ఫలాల మధురం
మలయ మారుతం వీచే
సస్య శ్యామలం...

సుజలాం సుఫలాం మలయజ శీతలాం 
సస్య శ్యామలాం వందేమాతరం (2)

వందేమాతరం (4 సార్లు )
తల్లీ మా వందనం 


చరణం 3
విద్యవు నీవే ధర్మము నీవే-
హృదయము నీవే సర్వము నీవే,
ఈ దేహానికి ప్రాణము నీవేలే

 బాహుశక్తి మా కిమ్మూ 
 హృదయ భక్తిగై కొమ్ము 
 గుండెల గుడిలో కొలిచే దేవతవే


గల గల పారే జలపాతం -
నోరూరించే ఫలాల మధురం,
మలయ మారుతం వీచే
సస్య శ్యామలం...

సుజలాం సుఫలాం మలయజ శీతలాం 
సస్య శ్యామలాం వందేమాతరం (3)

వందేమాతరం (4 సార్లు )
తల్లీ మా వందనం 


!!చ!! 4
పది భుజములతో శస్త్ర ధరించిన,
 ఆది శక్తివి దుర్గవు నీవే,
పరిమళాలు వెదజల్లు కమలముల -
వసియించెడి శ్రీ లక్ష్మివి నీవేలే


చదువుల నిచ్చెడి వాణివి నీవే
నిత్యము నమ్మితి నీ చరణాలే 
అమలాం అతులాం సుజలాం 
సుఫలాం 

శ్యామలం నీ రూపం-
సరళం ఆ కంఠం
సుస్మితం నీ వదనం -భూషితం నీ దేహం

ధరణీమ్,భరణీమ్ - మా ఈ జీవితం నీకే అంకితం వందే మాతరం 


వందేమాతరం (4 సార్లు )
తల్లీ మా వందనం

1 comment: