రామా రామా రఘురామ జానకి వల్లభ జయ రామా - Lord Rama Songs in Telugu
రాముని మించిన వారెవరు
లోకములో లేరింకెవరు
బ్రోచేవారు ఇంకెవరు
రామునికి సరి రారెవరు
రామా రామా రఘురామ
జానకి వల్లభ జయ రామా!!
1.
నావను నడిపి నది దాటించిన
గుహుడి సేవలు అపురూపం
అయోధ్యలో రారాజుల ప్రక్కన గుహునికి గౌరవ స్థానం ఇచ్చిన
!!రాముని మించిన!!
2.గురుకులమ్ములో విలువలు నేర్చి అరుంధతిని తన తల్లిగ తలచె
శాపం పొందిన మాత అహల్యను ఓదార్చెను ,చైతన్యము నింపెను
!!రాముని మించిన!!
3.విల విల లాడే సీతను జూచే
రావణున్ని తన ముక్కుతో పొడిచే
ప్రాణమొసంగిన జటాయు పక్షికి
దహన క్రియలే శ్రద్దగ చేసె
!!రాముని మించిన!!
4.భక్తితో శబరి ఇచ్చిన పళ్ళను ఆరగించె ఆనందంతోనూ
జై శ్రీరామని వానరులంటే
గుండెనిండుగ కొలువై ఉండె
!!రాముని మించిన!!
5. లంకను గెలిచి, తిరిగిచ్చేసి విభీషణున్ని రాజుగ చేసే
వాలిని చంపి, రాజ్యం వద్దని
అంగదుడిని యువరాజుగ చేసే
!!రాముని మించిన!!
6. సీతను అడవుల పంపెను గాని
ఎడబాటున విలపించేను
భార్యభర్తల ప్రేమెటువంటిదో లోకానికి చూపించెను రాముడు
!!రాముని మించిన!!
7. ఉత్తర దిశలో జన్మించి,
దక్షిణ దిశలో పయనించి
భారతీయులం మనమంటూ
తరతమ భేదం తగదంటూ
!!రాముని మించిన!!
రాముని మించిన వారెవరు
ReplyDeleteలోకములో లేరింకెవరు
బ్రోచేవారు ఇంకెవరు
రామునికి సరి రారెవరు
రామా రామా రఘురామ
జానకి వల్లభ జయ రామా!!