రామసేన కదలాలిరా... అయోధ్యలో గుడి కట్టాలిరా - Ramasena Kadalalira Song Lyrics in Telugu

 

 రామసేన కదలాలిరా... అయోధ్యలో గుడి కట్టాలిరా

నిన్నామొన్నాది కాదు త్రేతాయుగ కాలంది
మరచిపోవ తరం కాదు రాముడు నడయాడినది

పుత్రకామేష్టి యాగమే జరిగిన స్థలమిదిరా
రాముడు లక్ష్మణ భరతుడు శతృఘ్నుడు పుట్టినది
నింగినున్న దేవతలు వశిష్ఠాది ఋషి మునులు
హనుమంతుడు జాంబవంత సుగ్రీవుని సేనలంతా
శ్రీ రాముని భక్తులుగా వచ్చినారురా...
పట్టాభిషేకం జరిగిన స్థలమిదిరా

బాబర్ తో మొదలుపెట్టి కుహనా నేతల వరకు
గుడిలోనే రాముడుంటే బందీగా చేశారు
రామునిగుడి కట్టాలని హిందువు ముందుకు వస్తే
మతతత్వపు ముద్రవేసి అవహేళన చేశారు
రామ జన్మ భూమి కొరకు తెగిన తనువులే
ఆశయాల స్పూర్తినిచ్చే హిందు తనయులే

రామ శిలలు, రామ జ్యోతి దేశమంతా కదిలింది
వ్యక్తి వ్యక్తిలో ఉద్యమ ప్రేరణ రగిలించింది
ఓటు బ్యాంకు నేతలంత రామభక్తి నాపచూసి
అడుగడుగున అడ్డంకులు సృష్టించిన ఘటనలెన్నొ
కరసేవకు లొక్కొక్కరు హనుమ రూపులై
బానిసత్వ చిహ్నం కూల్చారు చూడరా

ఒకమాట ఒక బాణం సీతమ్మే తన ప్రాణం
సత్యానికి ధర్మానికి శ్రీరాముడే ఆదర్శం
వాడవాడలా అయోధ్య వీర గాధ వినిపిద్దాం
మన భాగస్వామ్యంతో మందిరాన్ని నిర్మిద్దాం
రామరాజ్య స్థాపనకై ప్రతిన బూనుదాం
హైందవ ధర్మానికి సంరక్షకులవుదాం

1 comment:

  1. ఒకమాట ఒక బాణం సీతమ్మే తన ప్రాణం
    సత్యానికి ధర్మానికి శ్రీరాముడే ఆదర్శం
    వాడవాడలా అయోధ్య వీర గాధ వినిపిద్దాం
    మన భాగస్వామ్యంతో మందిరాన్ని నిర్మిద్దాం
    రామరాజ్య స్థాపనకై ప్రతిన బూనుదాం
    హైందవ ధర్మానికి సంరక్షకులవుదాం

    ReplyDelete