Breaking News

కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం - Koti Gontu Lekamai Song Lyrics in Telugu



 

కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం,
భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతాకీ జై , భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతాకీ జై ||2||

చరణం - 1
ఈ భూమి తల్లియని నేనామె పుత్రుణ్ణని, 
జనని జన్మభూమి కన్న స్వర్గము లేనేలేదని, 
స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగ ||2 సార్లు!|
భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా కీ జై | 

కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం!!

చరణం - 2
ప్రజలను రెండుగ చీల్చే పదవీ స్వార్థాలు వదలి , 
కులముల కొట్లాట వీడి దేశమాత చెంతచేరి ,  సామరస్యమును జూపి సమైక్యతను సాధించగ ||2||
భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా కీ జై ||    

కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం

చరణం - 3
సంఘర్షణ కానరాని వైవిధ్యం గల దేశం,   దారులన్ని వేరైనా ఒకే సత్య సందేశం, 
కాశ్మీరము నుండి కదలి కన్యాకుమారి దాకా ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా కీ జై 

కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం   ||భారత్ మాతా||

చరణం - 4
మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది, 
సేవా త్యాగాలతో జగతి విస్తరించింది, 
శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా కీ జై 

కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం|||

1 comment: