జీవితాన్ని తీర్చిదిద్దుతుంది భగవద్గీత - Special Story about Bhagavad Gita in Telugu
గీత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
మహాభారతంలో శ్రీమద్భగవద్గీత కు ప్రత్యేక స్థానం ఉంది మహాభారత యుద్ధం జరగరాదని భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది. యుద్ధం చేయనన్న అర్జునుడిని కర్తవ్యోన్ముఖుణ్ని చేయడానికి శ్రీ కృష్ణ పరమాత్మ బోధించిన విషయమే భగవద్గీత. 18 అధ్యాయాల సమాహారమే ఈ భగవద్గీత. భారతీయ ఇతిహాస లో ఎన్నో గీతలు ఉన్నప్పటికీ భగవద్గీతకు విశేష స్థానం ఉంది. అన్నిటినీ గీత అంటారు కానీ భగవంతుడే స్వయంగా బోధించడం వల్ల ఇది భగవద్గీత అయింది.
భగవద్గీత కు మాత్రమే పుట్టినరోజు
మనం సాధారణంగా మహా పురుషులు పురుషులు పుట్టిన రోజును జరుపుకుంటాం వీరు ఈ
సమాజానికి లోకానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ జయంతులు జరుపుతూ అదేవిధంగా
లోకకళ్యాణానికి గీత చేసిన ఉపకారం, ఉపదేశము అనన్య సామాన్యమైనవి. ప్రపంచ
సాహిత్యంలోనే కేవలం భగవద్గీత గ్రంథానికి మాత్రమే జయంతిని జరుపుతారు.
గీత_ వైరాగ్యం
గీతను చిన్న పిల్లలు చదవ వద్దని చెప్పే వారిని చూస్తుంటాం. అలా చేస్తే
వైరాగ్యం వస్తుంది అనే విమర్శ ఉంది. ఇది శుద్ధ అబద్ధం. అర్జునుడి కర్తవ్య
విమూఢతను తొలగించడానికి బోధించాడు కృష్ణుడు. కాబట్టి గీతను చదివితే
వైరాగ్యం జీవితంపైన విరక్తి వస్తుంది అనడంలో ఏ మాత్రం నిజం లేదు. పైగా
కర్తవ్య నిర్వహణ బోధపడుతుంది
గీత-యుద్ధం
గీత యుద్ధాన్ని ప్రేరేపిస్తుందనే అనే విమర్శ కూడా కొందరు చేస్తుంటారు. కానీ
ఇది కూడా పూర్తిగా అసంబద్ధం. ప్రపంచ చరిత్రలో ఎన్నో కోట్ల మందిని బలి
తీసుకున్న వారు ఇలా విమర్శించడం విడ్డూరంగా ఉంటుంది. జీవితం అనే యుద్ధంలో
ఎన్నో రకాల సమస్యల్లో సతమతమయ్యేప్పుడు దిక్సూచిలా దారి చూపేది భగవద్గీత.
సమస్యలతో పోరాడి విజయం సాధించామని చెప్పేది భగవద్గీత. అంతేకాని యుద్ధాన్ని
ప్రేరేపించేది, హింసను రెచ్చగొట్టేది ఎంతమాత్రం కాదు.
గీతలో లేనిది లేదు
అవును గీతలో ఈ ప్రపంచానికి సంబంధించిన ఎన్ని విషయాలు ఉన్నాయి. అన్నిటిని
కూడా చూడవచ్చు. మానవ జీవిత లక్ష్యం ఏమిటి? దానిని సాధించడానికి ఎన్ని రకాల
మార్గాలు ఉన్నాయి మొదలైన విషయాలను బోధిస్తుంది భగద్గీత.
గీత_ సమదృష్టి
సమాజంలో కనిపించే అసమానతలు, ఎదురవుతున్న సామాజిక రుగ్మతలకు గీత ఆనాడే సమాధానం చెప్పింది. ఉదాహరణకు అంటరానితనం.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ స్వపాకేచ పండితాః సమదర్శినః
అనగా బ్రాహ్మణుని యందు చండాలుని యందు సమదృష్టి కలిగిన వాడే పండితుడు అని గీత బోధించింది.
పిరికితనం వదిలిపెట్టు
ఈరోజు ప్రపంచంలోని సమస్యలన్నిటికీ ప్రధానకారణం పిరికితనం. అందుకే పరమాత్మ
క్లైబ్యం మస్మ గమం పార్థా అన్నాడు. అంటే నీలో ఉన్న పిరికితనాన్ని ముందు
వదిలిపెట్టు అన్నాడు. దీని ద్వారా పిరికితనమే, బలహీనతే మన సమస్యలన్నిటికి
మూలమని స్పష్టమవుతున్నది. స్వామి వివేకానంద కూడా ఈ గీతా సందేశాన్నే
మరోసారి మనకు వినిపించారు. `బలమే జీవనం, బలహీనతే మరణం’ అంటూ ఉద్బోధించారు.
ఎందరికో ప్రేరణ
మహాత్మాగాంధీ, వివేకానంద, వినోభాభావే, బాలగంగాధర్ తిలక్, ఐన్ స్టీన్, ఓపెన్
హేమర్ తదితరులు ఎందరికో ప్రేరణ నిచ్చింది గీత. నాకు ఏ సమస్య ఎదురైనా
గీతలోని ఏదో ఒక పేజీ పరిష్కారం చూపుతుంది అనేవారు గాంధీజీ. ప్రముఖ అణు
శాస్త్రవేత్త ఓపెన్ హేమర్ అణు విస్ఫోటన దృశ్యం తనకు భగవద్గీతలో
విశ్వరూపసందర్శనాన్ని గుర్తు తెచ్చిందని చెప్పారు. ఆ సమయంలో తన నోటివెంట
అప్రయత్నంగానే విశ్వరూపానికి సంబంధించిన శ్లోకాలు వచ్చాయని చెప్పారు.
కోర్టులో ప్రమాణ గ్రంథం
ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ కేవలం గీతా గ్రంథం పైననే ప్రమాణం చేయడం ఈనాటికీ
మనం కోర్టులలో చూస్తున్నాం. దీని వల్ల అది ఎంత విశిష్ట విశిష్ట గ్రంథమో
తేటతెల్లమవుతుంది. అమెరికా, ఇంగ్లండ్ మొదలైన దేశాల్లో నివసించే ప్రవాసీ
భారతీయులు పదవీస్వీకార సమయంలో ఈ భగవద్గీతపైనే ప్రమాణం చేస్తున్నారు.
గీత పలాయనవాదం కాదు
అయ్యేదేదో అవుతుంది, పోయేది పోతుంది, అయ్యేది కాకమానదు అని గీత
అకర్మణ్యతను, పలాయనవాదాన్ని బోధిస్తుందని కొందరు విమర్శిస్తుంటారు. కానీ
భగవద్గీత కర్తవ్య నిర్వహణను, కార్యకుశలతను బోధిస్తుందని అది చదివినవారికి,
అర్ధంచేసుకున్నవారికి తెలుస్తుంది.
గీత వ్యక్తి వికాస గ్రంథం
చాలా దేశాల్లో గీతను వ్యక్తిత్వ వికాస గ్రంథం పర్సనాలిటీ డెవలప్మెంట్
పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్, బ్రిటన్ తదితర
దేశాల్లో గీతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు.
గీత కేవలం పారాయణ గ్రంథమా?
కాదు. పారాయణ చేయడం ద్వారా గీతా సందేశాన్ని తెలుసుకుని, ఆచరించాలి. అందుకే అది ఆచరణ గ్రంథం, జీతం. ఆచరిస్తే ఫలితం వస్తుంది.
గీత ప్రస్తుత స్థితి
గీత ను కేవలం ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే రికార్డుగా చూస్తున్నాం. అది
సరికాదు. అది జీవితాన్ని నేర్పే, ఆచరణను తీర్చిదిద్దే అమృత గ్రంథమనే విషయం
మరచిపోతున్నాము.
మన కర్తవ్యం
ప్రతి ఇంటికి ప్రతి మనిషి దగ్గరికి తీసుకు వెళ్లడం, చదివించడం, ఆచరించడమే మనముందున్న అసలు సిసలు పని,
జై భగద్గీత … జై శ్రీ కృష్ణ
– బొడ్డు సురేందర్
మహాభారతంలో శ్రీమద్భగవద్గీత కు ప్రత్యేక స్థానం ఉంది మహాభారత యుద్ధం జరగరాదని భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్ముడు అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధం అనివార్యమైంది.
ReplyDeleteభగవద్గీత అన్ని వేదాల సంకలనం.
ReplyDeleteధన్యవాదాలు
Iskcon Social