Breaking News

నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం

 


ఆదిలాబాద్‌: ‌భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ ‌మాననీయ శ్రీ దేవందర్‌ ‌జీ, శ్రీ దుర్గారెడ్డి గారు వివిధ సామాజిక, స్వచ్ఛంధ సంఘాల పెద్దలు మరియు సంఘ్‌ ‌కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 గతంలో అసలు ఏం జరిగింది?
జనవరి 12, 2020 తేదీన పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడు ద్విచక్రవాహనంపై వీధుల్లో విచక్షణారహితంగా హంగామా చేస్తుండటంతో స్థానిక యువకులు మందలించారు. ఇదే అదనుగా, ఘర్షణలే లక్ష్యంగా దాదాపు 400-500 మంది హిందువుల ఇళ్లపై ప్రణాళిక బద్దంగా దాడి చేసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.
 
హిందూ జనాభా తక్కువగా ఉన్న కొర్బా వీధిలో 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. వీటిలో స్థానిక హిందు వాహిని కార్యకర్త ఇంటిని అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఫైర్‌ ఇం‌జన్‌ ‌వాహనాల పైపులను కోయడంతో పాటు స్థానిక ఇండ్లను సైతం లూటీ చేశారు.

1 comment:

  1. భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది.

    ReplyDelete