Breaking News

5000 ‌మంది ఎస్సీలకు విహెచ్‌పి అర్చక శిక్షణ పూర్తి - VHP Priestly Training for 5000 SCs is Completed


 

సామాజిక సమరసతలో భాగంగా నిమ్నవర్గాలను ధార్మిక జీవనానికి దగ్గర చేసే కృషిలో భాగంగా  విశ్వహిందూ పరిషత్‌  ఒక మహత్తర మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందినవారికి అర్చకత్వంలో శిక్షణనిచ్చింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషద్‌ ‌జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ ‌బన్సల్‌ ‌ప్రకటన విడుదల చేశారు.


ఐ.ఏ.ఎన్‌.ఎస్‌ ‌వార్తా సంస్థతో మాట్లాడిన శ్రీ వినోద్‌ ‌బన్సల్‌.. ‌దేశంలోని దక్షిణాదిలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ సామాజిక వర్గీయులకు అర్చకత్వంలో శిక్షణనిచ్చామని, కేవలం ఒక్క తమిళనాడులోనే ఈ సంఖ్య 2,500 అని తెలిపారు. ఆంధప్రదేశ్‌ ‌తరువాతి స్థానంలో ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందినవారికి అర్చకత్వంలో శిక్షణ నివ్వడంలో తాము విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు.


ఈ  శిక్షణలో వివిధ రకాల ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, పూజా విధానాలపై శిక్షణ అందించి, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి గుర్తింపు పత్రాలు కూడా జారీ చేసినట్టు వినోద్‌ ‌బన్సల్‌ ‌తెలిపారు. వీరందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి పరీక్ష నిర్వహించి, తగిన ఉత్తీర్ణత పత్రాలు అందజేస్తుందని అన్నారు.

- లోకహితం. 


విశ్వ హిందూ పరిషత్ లో చేరుటకు...

3 comments:

  1. సామాజిక సమరసతలో భాగంగా నిమ్నవర్గాలను ధార్మిక జీవనానికి దగ్గర చేసే కృషిలో భాగంగా విశ్వహిందూ పరిషత్‌ ఒక మహత్తర మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

    ReplyDelete
    Replies
    1. వేదం వింటే చెవిలో సీసం పోయండి, పలికితే నాలుక తెగకొయ్యండి అనే స్థితి నుండి, ఇప్పటిస్థితికి తీసుకొచ్చిన ఆర్ ఎస్ ఎస్ కు అభినందనలు. వారే పూనుకోని పెద్దపెద్ద ఆలయాల్లో అందరికంటే అత్యుత్తమ స్థాయిలో వారిని వుంచగలిగినప్పుడే... వారు చేసినపనికి సార్ధకత.

      Delete
    2. మీరు కోరుకుంటుంది కూడా జరుగుతుంది. సమయం పడుతుంది.
      సమాజంలో సమరసత కోసం సంఘం నిరంతరం ప్రయత్నిస్తుంది..

      Delete