Breaking News

బెంగాల్‌ ‌విభజన అడ్డుకున్న శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ-Shyama Prasad Mukherjee


‘ఎక్‌ ‌దేశ్‌ ‌మే దో విధాన్‌, ‌దో ప్రధాన్‌, ‌దో నిశాన్‌ ‌నహి చలేగా, నహి చలేగా’ అంటూ జాతీయ సమైక్యత కోసం పోరాడారు డా.శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ. ప్రముఖ స్వాతంత్య్రయోధుడు అశుతోష్‌ ‌ముఖర్జీ కుమారుడైన శ్యామాప్రసాద్‌ ‌రెండవసారి బెంగాల్‌ ‌విభజన జరగకుండా అడ్డుకున్నారు. 1946లో కలకత్తా విశ్వవిద్యాలయ నియోజకవర్గం నుంచి బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆ తరువాత రాజ్యాంగసభలో బెంగాల్‌కు ప్రాతినిధ్యవహించారు.
దేశవిభజన సమయంలో కలకత్తాతోపాటు మొత్తం బెంగాల్‌ను తూర్పు పాకిస్థాన్‌లో కలపాలన్న ముస్లింలీగ్‌ ‌డిమాండ్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటిష్‌వారు 1905లో ఇలాగే బెంగాల్‌ను విభజించాలని చూసినప్పుడు ప్రజలు ‘వందేమాతర ఉద్యమం’ ద్వారా ఎలా ఎదుర్కొన్నారో అందరికీ గుర్తుచేశారు. మళ్ళీ ఒకసారి బెంగాల్‌ను కాపాడుకునేందుకు ప్రజానీకం ఉద్యమిస్తారని హెచ్చరించారు. దీనితో ముస్లింలీగ్‌, ‌కాంగ్రెస్‌లతోపాటు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి కేవలం ముస్లిం ఆధిక్య ప్రాంతాలనే తూర్పుపాకిస్థాన్‌లో కలిపింది.

1 comment:

  1. బెంగాల్‌ ‌విభజన అడ్డుకున్న శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ

    ReplyDelete