శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్ర-Shyam Prasad Mukherjee Life Story in telugu
ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్,
దో విధాన్ నహీ చెలేగా.. ఈ నినాదం వినగానే మన కళ్ల ముందు కదులుతారు దేశ
సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత.. బ్రిటిష్ వారు భారత దేశాన్ని
చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్ పుట్టక ముందే దాన్ని
చీల్చిన ఘనత ఆయనది.. దేశలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పన
ఇవాళ మహావృక్షంగా విస్తరించడం ఈనాడు మనం ప్రత్యక్షంగా చేస్తున్నాం.. ఈ
క్రమంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీని
గుర్తు చేస్తుకుందాం.
దేశభక్తియుత విప్లవ రాజకీయాల పురిటి గడ్డ
బెంగాల్ ఎందరో ప్రాతఃస్మరణీయుల్ని అందించింది.. వీరిలో కొందరి పాత్ర
స్వాతంత్య్ర పూర్వానికే పరిమతం.. మరి కొందరు స్వాత్రంత్యం తర్వాత కూడా
రాజకీయంగా ప్రభావం చూపించారు.. అయితే స్వాతంత్య్ర పూర్వం,
స్వాతంత్య్రానంతరమే కాదు, నేటికీ ఒక నాయకుడు నింపిన స్పూర్తి
కొనసాగుతోంది.. ఆ మహానేతే డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ..
రాజకీయ క్షేత్రంలోకి..
స్వాతంత్య్రోద్యమకాలంలో బెంగాల్‌లో
పరిస్థితులు క్షీణించాయి. రాష్ట్రంలో ముస్లిం లీగ్ ప్రభుత్వం అండతో
హిందువులపై దారుణమైన అత్యాచారాలు, హత్యాకాండ కొనసాగింది. రాష్ట్రంలో ఏర్పడ
క్షామ పరిస్థితులను పట్టించుకో లేదు. ప్రజలు ఆకలి కేకలతో చనిపోతుంటే సహాయ
కార్యక్రమాల్లో లీగ్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించింది. శ్యామ ప్రసాద్
ముఖర్జీ నేతత్వంలోని బెంగాల్ సహాయ సమితి కుల మతాలకు అతీతంగా అందరికీ
సహాయాన్ని అందించింది. సహాయ కార్యక్రమాల్లో మత రాజకీయాలను ఆయన తీవ్రంగా
నిరసించారు.
పాకిస్తాన్నే విభజించేశారు..
1946లో జరిగిన ఎన్నికల్లో మరోసారి
బెంగాల్ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శ్యామప్రసాద్ ముఖర్జీ.
సింద్, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో ముస్లింలీగ్ ప్రభుత్వాలు
ఏర్పడటంతో కొత్తగా ఏర్పడే పాకిస్తాన్ భూభాగాల విషయంలో స్పష్టత వచ్చింది.
బెంగాల్ ను పూర్తిగా పాకిస్తాన్‌లో కలపాలని లీగ్ వత్తిడి తేవడాన్ని
ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్య పేరుతో
వేలాది మంది హిందువులను ఊచకోత కోయించింది. కలకత్తా వీధులు శవాలతో
నిండిపోయాయి.
దేశ విభజన ఏకపక్షంగా జరగకుండా శ్యామప్రసాద్ ప్రారంభించిన ఉద్యమం అటు ముస్లింలీగ్, ఇటు కాంగ్రెస్ ను కూడా భయపెట్టింది. బెంగాల్ ను పాకిస్తాన్ లో పూర్తిగా విలీనం చేస్తే భవిష్యత్తులో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరించారు ముఖర్జీ. పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్ (బెంగాల్)ను తిరిగి భారత దేశంలో కలుపుతారని స్పష్టం చేశారు. బెంగాల్ లోని హిందూ ఆధిక్య ప్రాంతాలను ఇండియన్ యూనియన్ లోనే కొనసాగించాలనే డిమాండ్ తో ముఖర్జీ చేపట్టిన ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వంపై వత్తిడి పెంచింది. దీంతో ముస్లిం ఆధిక్య ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ (తూర్పు) పరిధిలోకి వెళ్లాయి. అదే విధంగా పంజాబ్ లోని హిందూ ప్రాంతాలను భారత్ లోనే కొనసాగించారు. మొత్తనికి ఇలా బ్రిటిష్ వారు ఇండియాను చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, పుట్టక ముందు పాకిస్తాన్ ను చీల్చేశారు శ్యామప్రసాద్ ముఖర్జీ.
కేంద్ర మంత్రి వర్గంలో ముఖర్జీ
తొలి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న
ముఖర్జీకి చాలా అంశాల్లో ప్రధాని నెహ్రూతో విబేధాలు ఉండేవి. దేశ విభజన
తర్వాత పాకిస్తాన్లో పెద్ద ఎత్తున హిందువుల నిర్మూళన కొనసాగింది.. అక్కడి
నుంచి 20 లక్షల మంది భారత్‌కు వలస వచ్చారు. పాకిస్తాన్తో కఠినంగా
వ్యవహరించి సమస్యను పరిష్కరించే విషయంలో ప్రధాని నెహ్రూ నిర్లక్ష్యాన్ని
ప్రదర్శించారు. పాక్ ప్రధాని లియాఖత్ అలీతో చర్చల విషయంలో నెహ్రూతో
శ్యాంప్రసాద్ ముఖర్జీ విబేధించారు మంత్రి వర్గ సమావేశంలో ఇద్దరికీ
వాగ్యుద్దం జరిగింది. శరణార్థల విషయంలో నెహ్రూ ధోరణిని నిరసిస్తూ కేంద్ర
మంత్రి పదవికి రాజీనామా చేశారు ముఖర్జీ.
జమ్మూ కశ్మీర్ కోసం బలిదానం
భారత మాతకు మకుటం కశ్మీరం. స్వాతంత్య్రం
తర్వాత భారత్ లో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విలీనం సందర్భంగా ప్రధాని నెహ్రూ
అనుసరించిన దాగుడు మూతల వైఖరితో సమస్య రాచపుండులా మారింది. తన మిత్రుడు
షేక్ అబ్దుల్లాకు అధికారం కట్ట బెట్టే ఆలోచనలో భాగంగా భారత దేశంలో ఏ
రాష్ట్రానికి లేని ప్రత్యేకతలను సష్టించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రధాన
మంత్రి, ప్రత్యేక పతాకం, రాజ్యంగం ఉండేలా షేక్ అబ్దుల్లాతో ఏకపక్ష
ఒప్పందాలు జరిగాయి. దీనికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 రూపంలో రక్షణ
కల్పించారు.
కశ్మీర్‌లో షేక్ అబ్దుల్లా వివక్షపూరిత
పాలనకు తోడు అక్కడి చట్టాలు, విదానాలు అన్నీ పాకిస్తాన్‌కు అనుకూలంగా
ఉన్నాయి. కశ్మీరీలు మిగతా బారతీయ సమాజంతో కలవకుండా ఆర్టికల్ 370
అడ్డుపడేది. ఈ అంశంపై దష్టి సారించారు శ్యామప్రసాద్ ముఖర్జీ.. ఆర్టికల్
370ని రద్దు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాన్నిచేపట్టింది జనసంఘ్.
1953 మేలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ
యాత్ర తలపెట్టగా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ముఖర్జీ
జమ్మూకశ్మీర్ భూభాగంలోకి ప్రవేశించగానే పోలీసులు అరెస్టు చేసి శ్రీనగర్
జైలుకు తరలించారు. అనంతరం చిన్న అతిధి గృహంలో నిర్భందించారు. ముఖర్జీ
అరెస్టు వార్త తెలిసి దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జనం పెద్ద
సంఖ్యలో జమ్మూ బయలు దేరారు. ఏక్ దేశ్‌మే దో ప్రధాన్, దో నిశాన్, దో
విధాన్ నహీ చలెగా నహీ చెలాగా అంటూ నినదించారు.
1953 జూన్ 23న నిర్భందంలో ఉన్న శ్యామ
ప్రసాద్ ముఖర్జీ అనారోగ్యంతో మరణించారనే వార్త దేశ ప్రజను దిగ్భ్రాంతికి
గురి చేసింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ముఖర్జీ మరణంపై అనుమానాలు ఉన్నా సరైన
విచారణ జరగలేదు. జమ్మూ కశ్మీర్‌ను భారత దేశంతో సంపూర్ణంగా కలిపే మహా
యజ్ఞంలో సమిధగా ఆహుతయ్యారు డాక్టర్ ముఖర్జీ. దేశ సమైక్యత కోసం ఆయిన
బలిదానం అయ్యారు.
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి సంపూర్ణంగా భారత దేశంతో అనుసంధానించడమే ఈ మహానేతను మనం ఇవ్వగలిగిన నివాళి..
– క్రాంతి దేవ్ మిత్ర
Source - VSK telangana
ReplyDeleteజమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి సంపూర్ణంగా భారత దేశంతో అనుసంధానించడమే ఈ మహానేతను మనం ఇవ్వగలిగిన నివాళి..
ReplyDeleteచాలా మంచి ఆర్టికల్.
ధన్యవాద్
Delete