Breaking News

భూగోళమా? ప్లాస్టిక్ గోళమా ?


ప్లాస్టిక్ వ్యర్థాలలో 5శాతం రీ సైక్లింగ్ చేస్తున్నారు. 40శాతం భూమిపై కుమ్మరిస్తే, 55శాతం సముద్రంలో పడేస్తున్నారు. సముద్రం లో 3టన్నులు చేపలుంటే,1టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి. ఆహారం అనుకుని చేపలు తినేస్తూన్నాయి. తాబేళ్ళు,సీల్ చేపలు ప్లాస్టిక్ తిని చచ్చి పోతున్నాయి. బయొడిగ్రెడిబుల్ ప్లాస్టిక్ ను తయారు చేయడం లో పారిశ్రామిక వేత్తలు దృష్టి సారించాలి.
ఆర్కిటిక్ సముద్రం లో 17రకాలైన ప్లాస్టిక్ వ్యర్థాల అవశేషాలు బయట పడ్డాయి.మనిషి వెంట్రుక సైజ్లో వున్న ప్లాస్టిక్ వ్యర్థాలను కనుగొన్నారు.సముద్ర జలాలు అవి తిని చనిపోతున్నాయి. ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయని పరిశోదకుల అంచనా.
నార్త్ సీ (అట్లాంటింక్ సముద్రం లో బ్రిటన్,స్కాండినేవియా, జర్మనీ,నెదర్లాండ్స్,బ్రెజిల్,ఫ్రాన్స్ దేశాల మధ్య వున్న భూభాగం-నార్త్ సీ అంటారు) తీరంలో 30 వేల్ చేపల మృత కళేబరాలు కొట్టుకు వచ్చాయి. ఒక చేప పొట్టలో కార్ల సీట్లు,మరొక చేప పొట్టలో 13మీటర్ల వల దొరికింది.మనిషి తనతో పాటు కలిసి జీవిస్తున్న ప్రాణుల అస్తిత్వానికి కూడా ముప్పు తలపెట్టడం అమానుషం.
భూగోళమా? ప్లాస్టిక్ గోళమా?అని పర్యావరణ వేత్తలు అందోళన చెందుతున్నారు. భూమిపైనా పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిని పశువులు కూడా చచ్చి పోతున్నాయి.
ఎవరెస్ట్ పర్వతారొహకుల సంఖ్య పెరగడంతో పర్యావరణ సంతులనం దెబ్బ తింటూన్నది. గత 50 సంవత్సరాలుగా ఎవరెస్ట్ వద్ద 45వేల కిలోగ్రాముల వ్యర్థాలను పడేశారు. అతి శీతల వాతావరణం వల్ల ఆ వ్యర్థాలు భూమిలో కలిసి పోవడం లేదు.అక్కడి నుండి ప్రవహించే నదీ జలాలు కలుషిత మై ప్రతి సంవత్సరం 3 కోట్ల 65 లక్షల టన్నుల మురికి నీరు ' లాసా' నదిలో కలుస్తున్నది. గత 62 ఏళ్ల లో 4 వేల మంది వదిలినవి చెత్త కుప్పగా మారింది.మానవ విసర్జితాలు ప్రమాద స్థాయిలో పెర్కొనిపొయాయి.
ఇప్పుడిప్పుడే ఎవరెస్ట్ ను శుభ్రపరిచే పనులు మొదలయ్యాయి. అధి రోహణ కు వెళ్లిన వారు తిరిగి వచ్చేప్పుడు కనీసం 8 కిలోల వ్యర్థాలు తేవాలని నిబంధన విధిస్తున్నారు. లేదా 100డాలర్లు జరిమానా విధిస్తున్నారు.
- అప్పాల ప్రసాద్ గారు.

2 comments:

  1. ఇప్పుడిప్పుడే ఎవరెస్ట్ ను శుభ్రపరిచే పనులు మొదలయ్యాయి. అధి రోహణ కు వెళ్లిన వారు తిరిగి వచ్చేప్పుడు కనీసం 8 కిలోల వ్యర్థాలు తేవాలని నిబంధన విధిస్తున్నారు. లేదా 100డాలర్లు జరిమానా విధిస్తున్నారు.

    ReplyDelete
  2. పై నుండి మూడవ పేరాలో చెప్పిన నార్త్ సీ దేశాలలో బ్రెజిల్ అన్నారు; కాదండి, బెల్జియం అని ఉండాలి. అలాగే “స్కాండినేవియా” అన్నారు, కానీ మొత్తం కాదు, మరో స్కాండినేవియన్ దేశమైన స్వీడన్ నార్త్ సీ లో లేదు; నార్వే, డెన్మార్క్ మాత్రం ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్, డెన్మార్క్, నార్వే, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ - ఈ ఏడు దేశాల మధ్యనున్న అట్లాంటిక్ మహాసముద్రపు భాగాన్ని (“భూభాగం” కాదు) నార్త్ సీ అంటారు.

    ఎవరెస్టుని శుభ్రపరచడం కోసం విధించిన నిబంధనలను కఠినతరంగా అమలు చెయ్యాలి. ఈ రోజుల్లో 100 డాలర్లు పెద్ద మొత్తం కాదు, జనాలకు ఆనదు, కనీసం 500 డాలర్ల జరిమానా అంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలుంటాయి.

    ReplyDelete