Breaking News

దేశ సేవలో...


ఒకసారి సుభాష్‌చంద్రబోస్‌ హింద్‌ఫౌజ్‌ కోసం నిధులు సేకరిస్తూ రంగూన్‌ వచ్చారు. ఆయన స్ఫూర్తివంతమైన మాటలు విని రాజమణి అనే 16 ఏళ్ళ అమ్మాయి తన ఒంటిమీద ఉన్న వజ్రాల, బంగారు నగలు దానం చేసింది. కానీ ఆమర్నాడు రాజమణి ఇంటికి వచ్చిన బోస్‌ ఆమె తండ్రితో ‘అమాయకత్వంవల్ల మీ అమ్మాయి నగలన్నీ ఇచ్చేసింది. అవి తిరిగి ఇవ్వడానికి వచ్చాను’ అన్నారు.


అలాగే మరొక బాల అనే అమ్మాయి హింద్‌ ఫౌజ్‌లో చేర్చుకోమని పట్టుబట్టింది. ఆమెతోపాటు మరో నలుగురిని గూఢచారి విభాగంలో చేర్చుకున్నారు. వీళ్ళంతా బ్రిటిష్‌ సైనిక అధికారుల  ఇళ్ళలో పనివారిగా చేరి అక్కడ రహస్య సమాచారాన్ని సేకరించేవారు. అలా రెండేళ్ళు వాళ్ళు ఎవరికీ అనుమానం రాకుండా పనిచేశారు. కానీ ఒకసారి ఒక అమ్మాయి పట్టుబడింది.అప్పుడు రాజమణి నర్తకి వేషం వేసుకుని జైలు అధికారులకు మత్తుమందు ఇచ్చి ఆమెను విడిపించింది. తప్పించుకుంటున్న సమయంలో సైనికులు జరిగిన కాల్పుల్లో గాయపడిన రాజమణి ఆ తరువాత శాశ్వతంగా ఒక కాలు కోల్పోయింది.

2 comments:

  1. ఒకసారి సుభాష్‌చంద్రబోస్‌ హింద్‌ఫౌజ్‌ కోసం నిధులు సేకరిస్తూ రంగూన్‌ వచ్చారు. ఆయన స్ఫూర్తివంతమైన మాటలు విని రాజమణి అనే 16 ఏళ్ళ అమ్మాయి తన ఒంటిమీద ఉన్న వజ్రాల, బంగారు నగలు దానం చేసింది.

    ReplyDelete
  2. 16 ఎళ్ళ అమ్మాయి... నర్తకి వేషంలో జైల్లో ఉన్న ఒక గూఢాచారిని విడిపించుకెల్లేంత వీక్గా ఉండేదా ఆంగ్లేయుల పాలన? ఇది ఎక్కడ రికార్డు చేసి ఉంది?

    ReplyDelete