Breaking News

డా.అంబేద్కర్ - అంటరాని తనం


మన సమాజానికి శాపం అంటరాని తనం..ఇది తొలగించడానికి ఆదిశంకరులు, రామానుజులు,బసవేశ్వరుడు,స్వామి వివేకానంద,గురునానక్,దయానంద సరస్వతి,సంత్ రవిదాస్,వీర సావర్కర్,నారాయణ గురు,డా.హెడ్గేవార్, లాలా లజ్పతి రాయ్ ,మహాత్మా ఫూలే,భాగ్యరడ్డి వర్మ, గాంధిజీ వంటి మహనీయులు,ఆర్యసమాజం,ప్రార్థన సమాజం, హిందూ మహాసభ,సంత్ సమాజ సంస్థ ,బహిస్కృత హితకారిణీ సభ,ఆర్ ఎస్ ఎస్  వంటి ఎన్నొ సంస్థలు చెస్తున్న కృషి వెలకట్టలేనిది.అయినా కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ సమస్య మిగిలి వుంది.సామాన్య ప్రజానీకం లో అవగాహన లేని కారణం , అజ్ఞానం వల్ల ఇంకా హిందూ సమాజానికి హాని జరుగుతున్నది.అలాగే రాజకీయ కారణాలు కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నది.డా. అంబేద్కర్ ఈ అంటరాని తనానికి వ్యతిరేకంగా , వందల సంవత్సరాలుగ పీడనకు గురవుతున్న వారి అభివృద్ధికి నడుం బిగించారు.
1920 లో నాగ పూర్ లో 18 కులాల వారిని పిలిచి సామూహిక భోజనాలు ఏర్పాటు చేసారు డా అంబేద్కర్.
1927 లో చౌదర్ చెరువు వాడు కోవడానికి నిమ్న జాతుల్లో ధైర్యం నింపారు.అదే ఏడు నాసిక్ లో దేవాలయ ప్రవేశ ఉద్యమం చేసారు.1930 లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లో స్వతంత్ర భారత దేశం లో నిమ్న వర్గాలకు సమానత్వం కావాలని కోరారు.
మూకనాయక్,బహిష్కృత భారత్ వంటి పత్రికలకు సంపాదకత్వం వహించారు.   

ఇలా ఎన్నెన్నొ ఉద్యమాలు..ఎవరివరితోనో చర్చలు ..ఇవన్నీ బడుగు ప్రజల ఉన్నతి కోసమే..   
( హిందువులనుండి ఎస్ సి లను వేరు చేయాలనే లక్ష్యం తో పని చెస్తున్న కొందరు విద్యావంతులు దేశాన్ని విభజించే ప్రమాద కర చర్యలకు మద్దతు పలుకుతున్నారు.రావణాసురుల , నరకాసురుల వారసులమని, దసరా,దీపావళి,దసరా బతుకమ్మ పండుగలను జరుపుకోవద్దని రెచ్చగొడుతున్నారు.దేశం లోని అన్ని వర్గాలతో కలిసి సహజీవనం చెస్తూ, అంబేద్కర్ వలే బుధ్హిమంతులు కావాలని చెప్పకుండా ఇతర కులాల వారిపై ఉసిగొల్పే విద్రోహ కార్యకలాపాలు ప్రభుత్వ ఉద్యోగాల ముసుగులొ చెస్తున్నారు.జె ఎన్ యూ లొ అఫ్జల్ గురు, హెచ్ సి యూ లో యాకూబ్ మేమెన్ వంటి దేశద్రొహుల చిత్రపటాల పక్కన అంబేద్కర్ ఫొటో పెట్టి విద్రోహ కార్యకలాపాలు చేస్తున్న విద్యార్థుల, సంఘాల కు మద్దతు తెలిపే పనుల్లో బిజీ,బిజీగా వ్యూహాలు పన్నుతున్నరు..దలితులను రజాకార్ ఒవైసీ అనుచరుల చెతుల్లో, విదేశీ క్రైస్తవుల కౌగిట్లో, నక్సలైట్ల పిడికిల్లో,కమ్యూనిస్టుల సిద్ధాంతాల్లో ఇరికించి దళితుల జీవితాలను సర్వనాశనం చెయాలని చూస్తున్న వీళ్ళంతా దళితుల నిజమైన నాయకులంటే ఎవరు నమ్ముతారు?    వీళ్ళ చర్యలు  డా అంబేద్కర్ సిద్ధాంతానికి విరుద్ధం కాదా ఆలోచించండి.

డా.అంబేద్కర్ - ఇద్దరు భార్యలు - సహధర్మచారిణులు 

బరోడా మహరాజ్ , కోల్ హాపూర్ మహరాజుల సహకారం తో ఉన్నత చదువులు చదివి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసి దేశాని కి పేరు తెచ్చి, తనకు సహాయం చేసిన వారి ఋణాన్ని దేశాని కి సేవ చేస్తూ తీర్చుకున్న వినమ్ర , వినయ వంతుడు డా. అంబేద్కర్.( ప్రజల పన్నులతో, ప్రభుత్వ సబ్సిడీలతో విద్యనభ్యసిస్తూ యూనివర్సిటీలలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే నేటి కొందరు విద్యార్తులు, వారిని  తప్పుదారి పట్టించే ప్రొఫెసర్లను మనం చూస్తూనే వున్నాం ఈ రోజుల్లో )

సంస్కృతం అధ్యయనం చేసారు.ఆర్యులు బయట నుండి వచ్చి ఇక్కడి దళితులను, దస్యులను, మూలవాసులను తరిమికొట్టారంటూ ఇప్పటికీ కొనసాగుతున్న తప్పుడు చరిత్రను డా అంబేద్కర్ అప్పుడే అబద్ధమని నిరూపించారు. ఆర్య అనే శబ్దం ఒక జాతికి, ఒక వర్గాని సంబంధించినది కాదని, వేదం లో ఆర్య అనే శబ్దం 33 సార్లు వచ్చిందనీ, అది గుణవాచకమని అంటే శ్రేష్టుడని అర్థమని డా.అంబేద్కర్ వివరించారు. సంస్కృతం చదివినందువల్ల డా.అంబేద్కర్ నిజం గుర్తించారు.అంతేఅ కాదు ఎస్ సి వర్గాల వారికి 3 సూత్రాలు పాటించమన్నారు. 1.చదువు..2.ఐక్యంగ వుండు...3 పోరాడు అంటూ సుద్దులు చెప్పారు.ఎందుకంటే తాను బాగా లోతుగా చదివాడు కాబట్టే నిజానిజాలు తెలుసుకున్నాడు.( ఈ రోజు అంబేద్కర్ పేరుతో పని చేసె కొన్ని దళిత సంఘాలు సంస్కృతాన్ని ద్వేషిస్తున్నాయి. హిందుత్వాన్ని తిట్టే కథలే తప్ప మరేమి చదువు రాని అజ్ఞానులకు డా అంబేద్కర్ అంతరంగిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం ఈ జన్మలో సాధ్యం కాదు.అన్ని కులాలతో ఐక్యంగా వుండమంటే,కులపిచ్చి తో ఒక కులాన్ని రెచ్చగొట్టి కలపటం తప్ప ఇంకో పని చేయరు.సామజిక అసమానతలను దూరం చేసి వ్యవస్తలను మార్చాలని అంబేద్కర్ చెప్తే...మైకుల్లో ఇతర కులాలను పచ్చి బూతులు తిట్టి,కొట్లాటలకు ఉసిగొల్పే ఈ సూడో దళితనాయకులకు అంబేద్కర్ నిజంగా అర్థమయ్యాడంటే అనుమానమే?) 

కొలంబియా లో పి హెచ్ డి,లండన్ లో ఎం ఎస్ సి,డి ఎస్ సి, బార్ ఎట్ లా పట్టాలు,జర్మనీ లో రెండు సార్లు పట్టాలు డాక్టరేట్లు పొందిన డా..అంబేద్కర్ వాణిజ్య శాస్త్రం లో, రూపాయి సమస్య మీద వ్యాసాలు వ్రాసి ప్రపంచ ప్రసిద్ది పొందాడు. దళితులే మూలవాసులంటూ కొందరు చరిత్ర ను తప్పుదారి పట్టించే వ్యాసాలు వ్రాసి కులాల మధ్య చిచు పెట్టే వారికి అంబేద్కర్ కి వున్న దేశ సమగ్రత పట్ల వున్న నిష్ఠ లో వెయ్యవ వంతు లేకపోగా దేశ విభజన లో అందె వేసిన వారిగ గుర్తింపు పొందారు) 

డా.అంబేద్కర్ ఆర్థిక ఇబ్బందుల్లో వుంటే మొదటి భార్య పశువుల పేడ లు అమ్మి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పొషించింది.భర్తకు కూడా పంపింది.రెండవ భార్య డా.సవిత బ్రాహ్మణ కులం లో జన్మించినా భర్త అంతిమ కాలం లో ఆయనను సేవించడానికి వెనుకాడలేదు. హిందూ కుటుంబం లో ని స్త్రీ, భర్త పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహించినట్లే ఆమె నిర్వహించింది.మొదటి భార్య మరణించినప్పుడు హిందు ఆచారాల కనుగుణంగా గుండు కొట్టించుకున్నాడు.హిందూ ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేశాడు.

1927 లో మహద్ చెరువు సత్యాగ్రహ సమయం లో స్థానికంగా ఒక నాయకుడు అంబేద్కర్ కి ఉత్తరం వ్రాసి, బ్రాహ్మణులు తమ ఉద్యమం లో పాల్గొనకుండా చూడాలని,లేనట్లయితే తాము ఉద్యమానికి దూరంగా వుంటామని హెచ్చరించింప్పుడు అంబేద్కర్ తన వెంట తన ఉద్యమానికి బాసటగా నిలిచిన బ్రాహ్మణులను కూడా వెంట తీసుకుని పోయి,తాను బ్రాహ్మనులను ద్వేషించే వాన్ని కాదని నిర్ద్వందంగా చెప్పిన నాయకుడు డా.అంబెద్కర్.( అంబేద్కర్ పేరు చెప్పుకుని బ్రహ్మణులను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళను తిట్టకుండా వ్యాసాలు , ఉపన్యాసాలు వుండవు. ఇదీ అంబేద్కర్ కి , ఈ సూడొ అంబేద్కరిస్టులకు వున్న తేడా.)
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. మన సమాజానికి శాపం అంటరాని తనం..ఇది తొలగించడానికి ఆదిశంకరులు, రామానుజులు,బసవేశ్వరుడు,స్వామి వివేకానంద,గురునానక్,దయానంద సరస్వతి,సంత్ రవిదాస్,వీర సావర్కర్,నారాయణ గురు,డా.హెడ్గేవార్, లాలా లజ్పతి రాయ్ ,మహాత్మా ఫూలే,భాగ్యరడ్డి వర్మ, గాంధిజీ వంటి మహనీయులు,ఆర్యసమాజం,ప్రార్థన సమాజం, హిందూ మహాసభ,సంత్ సమాజ సంస్థ ,బహిస్కృత హితకారిణీ సభ,ఆర్ ఎస్ ఎస్ వంటి ఎన్నొ సంస్థలు చెస్తున్న కృషి వెలకట్టలేనిది.అయినా కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ సమస్య మిగిలి వుంది.సామాన్య ప్రజానీకం లో అవగాహన లేని కారణం , అజ్ఞానం వల్ల ఇంకా హిందూ సమాజానికి హాని జరుగుతున్నది.అలాగే రాజకీయ కారణాలు కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నది.డా. అంబేద్కర్ ఈ అంటరాని తనానికి వ్యతిరేకంగా , వందల సంవత్సరాలుగ పీడనకు గురవుతున్న వారి అభివృద్ధికి నడుం బిగించారు.

    ReplyDelete