పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 15 / 50
1957 లో పుత్తూరు( మంగళూరు జిల్లా) లో జిల్లా కార్యకర్తల సమావేశం. విద్యుత్తు దోబూచులాడుతుండటంతో ముందు జాగ్రత్త కోసం పెట్రోమాక్స్ లైట్ ను వెలిగించి పెట్టారు. అయితే వాస్తవంగా ఎక్కువ ఇబ్బంది కలుగుతుండింది పెట్రోమాక్స్ వల్లే. దాని వెలుగు పెరుగుతూ, తగ్గుతోంది. అపుడు అక్కడి జిల్లా ప్రచారక్ శ్రీ హరిభావు వఝె గారు.
శ్రీ గురూజీ సమావేశం మధ్యలోనే శ్రీ హరిభావు గారితో , ఆ పెట్రోమాక్స్ ను తీసి పక్కన ఉంచమని మరాఠీ లో చెప్పారు. అయితే ఆయన చెప్పింది సరిగా వినబడలేదో లేక మరే ధ్యాసలో ఉన్నారో ఏమో శ్రీ హరిభావ్ గారు మౌనంగా కూర్చుండిపోయారు. పెట్రోమాక్స్ ఆట సమావేశం పూర్తయ్యేవరకూ కొనసాగింది. సమావేశం ముగిశాక శ్రీ గురూజీ , శ్రీ హరిభావ్ గారిని దగ్గరకు పిలిచి... ' ఏమయ్యా, ఇక్కడికొచ్చి ఇంకా రెండేళ్ళు కాలేదు. అంతలోనే మరాఠీ మరచిపోయావా? విప్లవ వీరుడైన శ్రీ పాండురంగ ఖాన్కోజె గురించి నీకు తెలుసా? ఆయన 40 ఏళ్ళ పాటు విదేశాలలో ఉండి తమ పోరాటం కొనసాగించారు. అన్ని సుదీర్ఘ సంవత్సరాలపాటు ఆయనకు మరాఠీ లో ఒకే ఒక పదమైనా వినే, మాట్లాడే అవకాశమే దొరకలేదు. అయినా స్వదేశానికి తిరిగొచ్చాక , ముందులాగే ఆయన అనర్గళంగా మరాఠీ లో మాట్లాడుతుండేవారు' అన్నారు.
- బ్రహ్మానంద రెడ్డి.
1957 లో పుత్తూరు( మంగళూరు జిల్లా) లో జిల్లా కార్యకర్తల సమావేశం. విద్యుత్తు దోబూచులాడుతుండటంతో ముందు జాగ్రత్త కోసం పెట్రోమాక్స్ లైట్ ను వెలిగించి పెట్టారు.
ReplyDelete