Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 13 / 50


1972 మే నెలలో తిపటూరు లో సంఘశిక్షావర్గ. శ్రీ గురూజీని కలవడానికి శివమొగ్గ నుండి జ్యేష్ఠ కార్యకర్త అయిన శ్రీ డి. హెచ్. సుబ్బణ్ణ గారు తన భార్యాపిల్లలతో కలసి వచ్చారు. అంతకు ముందు వారింట్లో శ్రీ గురూజీ అనేక సార్లు ఉన్నారు. మధ్యాహ్న భోజన సమయం. శ్రీ సుబ్బణ్ణ గారిని భోజనానికి పదమన్నారు శ్రీ గురూజీ. సంఘశిక్షావర్గలో మహిళలు ఇతరులతో బాటు సహపంక్తిలో కూర్చుని భోజనం చేయడానికి అవకాశం ఉందా అనే విషయమై శ్రీ సుబ్బణ్ణ గారికి సందేహమూ, అవకాశం ఉండదనే తప్పుడు అభిప్రాయమూ మనసును తొలిచేస్తున్నాయి. ఆయన మనసులోని సంఘర్షణను గుర్తించిన శ్రీ గురూజీ , శ్రీ సుబ్బణ్ణ గారి కుటుంబ సభ్యులను కూడా భోజనానికి పదమని చెప్పి, పంక్తిలో కూర్చోబెట్టి, తమకు ఏర్పాటైన చోటికి వెళ్ళి కూర్చున్నారు. వారి పక్కనే శ్రీ సుబ్బణ్ణ గారిని కూర్చోబెట్టుకున్నారు. భోజనం చేస్తూ ' మన శిబిరంలో అలాంటి వ్యవస్థ ఉండదనే అనవసరపు సందేహమెందుకు మీకు. అలాంటి వ్యవస్థ చేయడం కష్టమా? ఇళ్ళలో వాళ్ళు మాలాంటివారికి వంట చేసి వడ్డించడం లేదా? మేము దాన్ని తినడం లేదా? భోజన సమయంలో వారిని వదలిపెట్టి మనం భోజనం చేయడం ఎలా సాధ్యం? అంటూ, నిత్య శాఖా సంబంధిత విషయాల్లో నియమాలు ఒకరకమైనవైతే, సంఘకార్యంలో నియమాలు మరోరకమైనవి ' అన్నారు శ్రీ గురూజీ.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. 1972 మే నెలలో తిపటూరు లో సంఘశిక్షావర్గ. శ్రీ గురూజీని కలవడానికి శివమొగ్గ నుండి జ్యేష్ఠ కార్యకర్త అయిన శ్రీ డి. హెచ్. సుబ్బణ్ణ గారు తన భార్యాపిల్లలతో కలసి వచ్చారు.

    ReplyDelete