RSS - స్వచ్చంద సామాజిక సంస్థ
మొన్నీమధ్య మా బంధువు ఒకామే రిటైర్ అయ్యి ఖాళీ గా ఉన్నాను. మేము RSS లో చేరితే ఏమిస్తారు అని అడిగారు. నేను ఆ ప్రశ్నకు ఆశ్చర్య
పడుతుంటే వాళ్ళాయన సంఘం అంటే త్యాగం సమర్పణ మాత్రమే. డబ్బులిచ్చేది కాదు అని వాళ్ళాయన ఆమెకు చెప్పారు. నిజమే ఈ ప్రశ్న నా 50 సంవత్సరాల సంఘ జీవితం లో ఎప్పుడూ రాలేదు అనేది ఆశ్చర్యం వేసింది. నిజమే 50 వేలకు పైగా ఉండే శాఖలు నడపడానికి శాఖ కు కనీసం ముగ్గురు రోజూ పని చేయాలి. ఇవి కాకుండా మండల, తాలూకా, జిల్లా, విభాగ్, ప్రాంత, క్షేత్ర, అఖిల భారతీయ జట్టులు ఉంటాయంటే ఎంత పని టర్న్ ఓవర్ అవుతుంది.
ఇవి దైనందిన కార్యక్రమాలు. రోజూ పని ఉంటుంది. ఎన్ని మానవ గంటలు(man hours) సంఘ మార్గదర్శనం లో ఎన్ని లక్షల మంది పని చేస్తారు? ఇవి కాకుండా సేవా కార్యక్రమాలు, సామాజిక వివిధ రంగాల పనులకు కార్యకర్తలు, ఉదాహరణకు సంపర్క, కౌటుంబిక బోధన, ధర్మజాగరణ, సామాజిక సమరసత, ఎన్ని కార్యాలయాలు, పెద్దల సమావేశాలు ఎన్నిగంటలు సమాజం కోసం స్వయంసేవకు లిస్తున్నారు !
అలాగే స్వయంసేవకుల, విద్యా లయాలు, వైద్యశాలలు, విద్యార్థుల హాస్టల్స్, వనవాసుల్లో, కార్మిక,కర్షక క్షేత్రాలు, ధార్మిక పరిషతులు, విద్యార్థి సంఘాలు, సంస్కృతం ప్రచార కార్య క్రమాలు వీటన్నింటిని నిర్వహించే స్వయంసేవకులు ఎంత మంది , ఎన్ని గంటలు తమ జీవితం లో అధిక భాగం నిరంతరం ఈ దేశానికితమ కర్తవ్యంగా పనిచేసే వారెవ్వరికీ పై ఆలోచన రాలేదు.
మాకు తెలిసింది పూజనీయ డాక్టర్జీ తను వైద్యం కూడా చేయకుండా తమ జీవిత సమయం అంతా సంఘ పనికి సమర్పించారు. వారు చెప్పింది ప్రతీ స్వయంసేవక్ తమ పని, వృత్తి, వ్యాపారం చేసుకుంటూ రోజు కనీసం రెండు గంటలు దేశం కోసం స్వచ్చందంగా సమర్పించాలని చెప్పారు. కొంత మంది వారిలాగా బ్రహ్మచారులుగా తమ జీవితాల్ని వేల సంఖ్యలో దేశానికి సమర్పితం అయ్యారు. వారి జీవితాలు ఆదర్శంగా
స్వయంసేవకుల సమయం, శక్తి, చాకచక్యం అన్నీ సమర్పించి దేశం కోసం స్వచ్చందంగా పని చేస్తారు.
మొన్నొక ఆదివారం శాఖలు కొన్ని పోటీలకి కలిసాయి. 6.30 గంటలకి 200 మంది స్వయంసేవకుల కలయిక.
అంత మంది రావడానికి కార్యకర్తలు రోజూ పని చేస్తూ ఆ రోజు ఉదయం 5.00 గంటల నుండి అందరిని లేపి తీసుకువచ్చే పని ప్రారంభం అయ్యి ఉటుంది. వచ్చిన వారికి 1.30 గంటలో అందరికి శారీరక, బౌద్ధిక్ కార్యక్రమాల కోసం ముందు సమావేశం జరిగి ఉంటుంది, శిక్షణ నిర్వహణకు ముందు తయారీ ఉంటుంది. నిర్వహణ తరువాత కూడా వారి కుటుంబాల సంపర్కం కొరకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగా స్వచ్చంద సేవకు ఎంత ప్రేరణ కావాలి. సంఘం సమాజ సమర్పణకు స్వయంసేవకులని తయారు చేసుకుంటుంది. పని చేయిస్తుంది. అది కూడా వారి స్వయం సమర్పిత స్వయంసేవకులతో.. నిజంగా ఇది ఒక తపస్సు. దేశం పరమ వైభవం పొందాలి. ఇదే లక్ష్యం. జీవిత పరమార్థం.
Please share to all your friends. Sangha invites you to our nations work.
- నరసింహ మూర్తి.
మొన్నీమధ్య మా బంధువు ఒకామే రిటైర్ అయ్యి ఖాళీ గా ఉన్నాను. మేము RSS లో చేరితే ఏమిస్తారు అని అడిగారు. నేను ఆ ప్రశ్నకు ఆశ్చర్య
ReplyDeleteపడుతుంటే వాళ్ళాయన సంఘం అంటే త్యాగం సమర్పణ మాత్రమే. డబ్బులిచ్చేది కాదు అని వాళ్ళాయన ఆమెకు చెప్పారు. నిజమే ఈ ప్రశ్న నా 50 సంవత్సరాల సంఘ జీవితం లో ఎప్పుడూ రాలేదు అనేది ఆశ్చర్యం వేసింది.