ప్రజాజీవన రంగంలో ఎంతో అనుభవం ఉంటే తప్ప ఆ పాత్రను ఎవరూ పోషించలేరు
అంబేద్కర్ , 20 వ దేశ భవిష్యత్తు గురించే కాదు, వేల సంవత్సరాల తర్వాత కూడా దేశానికి ఎదురయ్యే పరిస్థితులలో స్థిరంగా ఎలా ఉండాలో, గట్టి ఏకాత్మత గల, గట్టి ప్రభుత్వం గల దేశంగా రూపకల్పన చేయడం లో అత్యంత కఠినమైన పనిని, మనసు పెట్టి, శక్తి యుక్తులను వినియోగించారు. ఆయన అందించిన 'బలమైన భారతదేశ కల్పన' కు మనం తరతరాలుగా ఆయనకు ఋణపడి వున్నామనటంలో అతిశయోక్తి లేదు.కుల,మత కలహాలతో సతమతమవుతూ, వందల సంఖ్యలో వున్న చిన్నచిన్న రాజ్యాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యంగా భారత ప్రభుత్వం లో కలిపితే, అంబేద్కర్ సాహసంగా ఎన్నో విషయాలు అధ్యయనం చేసి, రాష్ట్రాలన్నీ కేంద్రం నీడన వుండి, సార్వభౌమత్వానికి రాజ్యాంగ బద్దతను కల్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ ని ఎన్నుకోగానే, 'ఇప్పుడు నేను ఎస్ సి వర్గాలకు మాత్రమే నాయకున్ని కాదని, సంపూర్ణ భారత సమాజం గురించి ఆలోచించ వలసునవాడిగా భావించి, ఆ మనో భూమికతో వ్యవహరించారు. ప్రజాజీవన రంగంలో ఎంతో అనుభవం ఉంటే తప్ప ఆ పాత్రను ఎవరూ పోషించలేరు. కాని అంబేద్కర్ ఆ పనిని సులభంగా నెరవేర్చారు.
- అప్పాల ప్రసాద్.
అంబేద్కర్ , 20 వ దేశ భవిష్యత్తు గురించే కాదు, వేల సంవత్సరాల తర్వాత కూడా దేశానికి ఎదురయ్యే పరిస్థితులలో స్థిరంగా ఎలా ఉండాలో, గట్టి ఏకాత్మత గల, గట్టి ప్రభుత్వం గల దేశంగా రూపకల్పన చేయడం లో అత్యంత కఠినమైన పనిని, మనసు పెట్టి, శక్తి యుక్తులను వినియోగించారు.
ReplyDelete