శ్రీ సరస్వతీ విద్యా పీఠం - తెలంగాణ
శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రాంత స్థాయి పూర్వ విద్యార్థి పరిషత్ సమ్మేళనము ఆహ్వానము ........డిసెంబర్ 17 వ తేదీ ఆదివారము శ్రీ సరస్వతీ విద్యా పీఠమునకు శ్రద్దా కేంద్రము అయిన శ్రీ శారదామాత సన్నిధి అయిన శ్రీ శారదాధామములో శిశు మందిరమములలో చదువుకొని వివిధ రంగాలలో స్థిర పడిన శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము శ్రీ శారదాధామములో నిర్వహించడము జరుగుతున్నది .శిశు మందిరమములలో చదువుకున్న కారణంగా తాము స్థిర పడిన రంగములో అంకిత భావముతో సేవలు చేస్తున్నట్లు అనేక మంది పూర్వ విద్యార్థులు పేర్కొనడం విశేషం .దీనికి ప్రేరణ స్రోతస్సు శ్రీ సరస్వతీ శిశు మందిరము .అయితే శిశు మందిర పూర్వ విద్యార్థులుగా సమాజానికి ,దేశానికీ ఏమి చేయాలో పెద్దల మార్గదర్శనం ద్వారా తెలుసుకోవలసిన అవసరం యుంది .ఈ అద్భుతమైన అపూర్వ మహా సమ్మేళనమునకు మన భారత ఉప రాష్ట్రపతి మాన్యులు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు పాల్గొనడం విశేషం .పూర్వ విద్యార్థులుగా రాజకీయ రంగములో అందరినీ ఆకట్టు కుంటూ తమ విశేష వ్యక్తిత్వమును చాటుకుంటున్న మన తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్యులు ,శ్రీ శారదాధామము తో మొదటి నుండి చక్కటి అనుబంధము యుండి తన పిల్లలలను శ్రీ శారదాధామములోనే చదివించిన మన ఆత్మీయ అభిమాని ,మన అందరి శ్రేయోభిలాషి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు పూర్వ విద్యార్థి పరిషత్ మహా సమ్మేళనంలో పాల్గొంటున్నారు అంతే కాకుండా విద్యా భారతి అఖిల భారత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ కాశీపతి గారు ,విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ లింగం సుధాకర రెడ్డి గారి మార్గదర్శనం ఈ అపూర్వ అద్భుత మహా సమ్మేళనంలో మార్గదర్శనం లభించగలదు .ఈ అద్భుత అప్పోర్వ పూర్వ విద్యార్థి మహా సమ్మేళనము అందరికీ ప్రేరణదాయకం కావాలి .మనకు తెలిసిన బాగా స్థిర పడిన పూర్వ విద్యార్థులకు ఈ సమాచారం చేరవేయాలి .పూర్వ విద్యార్థులు మనకు మహా శక్తి .ఈశక్తి జాతీయ ఆస్తి .ఈ శక్తి దేశానికి ,సమాజానికి ఉపయోగపడేరీతిలో మనము మలచాలి .అందుకొరకు మనము అందరమూ ప్రతి ఒక్కరినీ ఈ మహ సమ్మేళనంలో పాల్గొనేవిధంగా 100 శాతము సంపూర్ణ ప్రయత్నము చేద్దాం .భారత మాత కలలను నెరువేరుద్దాం .జగతిలోన భారతమాతను అధిదేవతగా నిలుపుదాం .
డిసెంబర్ 17 వ తేదీ ఆదివారము శ్రీ సరస్వతీ విద్యా పీఠమునకు శ్రద్దా కేంద్రము అయిన శ్రీ శారదామాత సన్నిధి అయిన శ్రీ శారదాధామములో శిశు మందిరమములలో చదువుకొని వివిధ రంగాలలో స్థిర పడిన శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము శ్రీ శారదాధామములో నిర్వహించడము జరుగుతున్నది .
ReplyDelete