Breaking News

విజయనగరం జ్ఞాపకాలు

నేను వెళ్లడం కంటే ముందు శ్రీ సుందర రామం అంతకంటే ముందు డాక్టర్ జనార్ధన్ గారు కొత్తగా ఏర్పడిన జిల్లాకి ప్రచారక్ గా వెళ్లారు. గ్రామాల్లొ శాఖలు రైతుల రాత్రి శాఖల విషయం ఎక్కువ చర్చలు జరుగుతండేవి.

కొత్త జిల్లా విశాఖ చుట్టు కొన్ని శాఖలు ఉండేవి. కార్యకర్తల బృందం తక్కువ. 

డాక్టర్ గారికి విశాల మైదానం. వాఎఇ తెల్ల పైజామా, ముతక చొక్క, ముక్కు పైకి జారిన కళ్లజోడు. అప్పటివరకు పాడేరు లో, అరకులో సైకిల్ మీద తిరిగి రోగులకు మందులు, పిల్లలకి ఆటలతో సమాజపని చేసె డాక్టర్‌గారికి బస్సు ప్రయాణాలు, శాఖల పెట్టడం, అందులో సంఘం పెద్దగా తెలియని గ్రామాలలొ.


అక్కడి కార్యకర్తలు చెప్పిన విషయాలే వ్రాస్తాను. జిల్లా పర్యటనకు సమయా నికి బస్సువదొరకక పోతే లారీ ఆపేవారట. ఎక్కడికి వెళాలి అని అడిగితే, లారీ ఎక్కడికి పోతుంది అని వీరే అడిగితే వాడికి ఆశ్చర్యం అతను నవ్వి బొబ్బిలి అంటే అక్కడికే, సాలూరు అంటే అక్కడికె అని ఎక్కి కూర్చునే వారట. ఎక్కడికి పోయినా కొత్త పరిచయాలు, దగ్గరిలో ఒక గ్రామం, ఊర్లొ రైతులతో సమావేశం, రాత్రి పూట కబడ్డి ఆటలు, సంఘ పరిచయం చేస్తూ కబుర్లు, ఎవరో ఒకరు భొజనం పెట్టక పోతారా అనే ధైర్యం. నిజంగానే తెర్లాం, నుండి రేజేరు లాంటి గ్రామాల నుండి రైతులు శిక్షావర్గకు వచ్చారంటే ఎంత కష్టపడి ఉండాలి? బొబ్బిలి లో జగన్నాథ్ నాతో చెబుతూ డాక్టరు గారు ఒక కాలు బొబ్బిలి బస్టాండు లో ఒక కాలు రేజేరు బస్సు ఫుట్బొర్డు పై మాకు కార్యక్రమాల సూచన ఇచ్చి వెళే్ వారు. అక్కడ ఏముందండి అని అడిగితే ఒక ఉత్సవం బౌద్ధిక్ కి పంపితే అదేమి ఊరండీ, ఊరంతా సంఘమే. రైతుల లో అందరూ శాఖకు రావడం ఎలాంటి పని జరిగి ఉంటుదో అర్థం అవుతుంది అని నాలుక కర్చుకొని డాక్టర్ గారు ఎంత పని చేసి ఉంటారు, అని తన మాట వెనక్కు తీసుకున్నాడు.
నేను‌ప్రచారక్ గా మానేసి పాతికేళ్ల అయిపొయింది. నాకంటే ఐదు సంవత్సరాల ముందు వారి పని అంటే దాదాపు సున్న నుండి ప్రారంభం చెసారు అనొచ్చు. మొన్నిమధ్య నేను వెళ్తే అయా గ్రామాలలో నేను కలిసిన అందరూ డాక్టర్ గారు ఎలా ఉన్నారు‌అని అడిగినా వారే అని చెప్పడానికి‌సంతోషం గా ఉంది.
- నమస్సులతో మీ నరసింహా మూర్తి.

1 comment:

  1. విజయనగరం జ్ఞాపకాలు.
    - నమస్సులతో మీ నరసింహా మూర్తి.

    ReplyDelete