Ramayanam-భారత జాతి కి ఉత్తమ నాయికా నాయకులు..సీతా రాములే..
' రామ ' అంటే ఆనందం కలిగించేది. రాముడు తన ధర్మం నిర్వర్తించి, అందరికి ఆదర్శంగా నిలిచాడు. బోయ కులంలో జన్మించిన వాల్మీకి రామ నామం తో పులకితుడై , మనందరికి రాముని కథ ను అందించాడు. సీతారాముల పెండ్లి ని చూసి దంపతులు అన్యోన్యంగా జీవించమంటారు మన పెద్దలు. భద్రాచలం లో పెళ్ళికి అప్పటి ముస్లిం రాజు తానీషా ప్రభుత్వం ప్రారంభించిన ముత్యాలు పంపే సదాచారం నేటికినీ కొనసాగుతూనే వుంది. చాలా సంవత్సరాల క్రితం రామాయణం టీవీ సీరియల్ గా వచ్చినప్పుడు పాకిస్తాన్ మహిళలు చూసి ఒకేభార్య కలిగిన రాముని, భర్తను ప్రేమించే సీతమ్మ గుణగణాలకు పొంగిపోయారట. 90 శాతం ముస్లిం లున్న ఇండోనేషియా దేశంలో ముస్లిం రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాల్లో సీతారాముల చిత్రాలు వుంచి, తాము మతం మారినప్పటికిని, ఇప్పటికి తమది రాముని సంస్కృతి యే నని గర్వంగా చెప్పుకుంటారు. తరగతి గదులకు కూడా రామాయణం లో ని పేర్లు పెడతారు. ఆసియా ఖండము లో ని దేశాలలో రామాయణం అందరికీ ఆచరణీయమైన గ్రంథం. రావణాసురుడి జన్మస్థలం శ్రీ లంక లో కూడా రాముడే ఆదర్శం. రావణుడు కాదు. ఈ మధ్య అబుదాబి అరబ్బు రాజు కూడా ప్రసంగాన్ని ముందుగా జైశ్రీరాం అంటూ మొదలు పెట్టాడు. ఇప్పటికి ఉత్తర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ముస్లిం మహిళలు శ్రీ రామునికి హారతులు ఇస్తూ పూజిస్తారు. పాయిఖానాలు శుభ్రం చేసే 'భంగీ ' కులంలో పుట్టిన తులసీదాసు రచించిన రామాయణం చదువుతూ కోట్లాదిమంది భక్తులు ఉత్తర భారతమంతా పరవశులై పోతున్నారు. స్థానికంగా కంబ, మొల్ల, కన్నడ రామాయణాలు ప్రజల కు ప్రేరణ నిస్తున్నాయి. మన ప్రజలకు సీతా రాములే నిజమైన హీరో హీరోయన్ లు, అంటే భారత జాతికిి నాయకులు.
- Appala Prasad.
భారత జాతి కి ఉత్తమ నాయికా నాయకులు..సీతా రాములే..
ReplyDelete