చైనా ఇకనైనా-Can We Change China's Attitude by Banning Their Products
ఇంట్లో కానివ్వండి నెట్టింట్లో కానివ్వండి! పిల్లల ఆడుకునే వస్తువైనా.. డిజిటల్ కంప్యూటర్ అయినా! దీపపు ప్రమిదలనుంచి మిరుమిట్లు గొలిపే బాణాసంచా వరకూ.. అంతా చైనా మయం. చౌకగాను అందరికి అందుబాటులో లభిస్తూ మార్కెట్‌ను కమ్మేశాయి... చైనా ఉత్పత్తులు. మొబైల్ ఫోన్ల విషయంలో అయితే ఇక చెప్పనవసరంలేదు ప్రముఖ బ్రాండ్లు సైతం చైనా తయారీ హ్యాండ్ సెట్లను వినియోగిస్తున్నాయి. ఇదీ అదీ అని కాదు. ఎలాంటి వస్తువైనా మేమున్నామంటూ విపణిని ముంచెత్తుతున్నాయి చైనా తయారీ వస్తువులు. అవి అతితక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందడానికి కారణం..కోరుకున్న రకాలు అతితక్కువ ధరలో లభించడమే. అలాంటి వస్తువుల్ని బహిష్కరించాలంటూ ఇటీవలి కాలంలో పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం నడుస్తోంది. కారణం... పాకిస్తాన్‌ను చైనా వెనకేసుకు రావటమే. ఆ స్థాయిలోనే డ్రాగన్ కంట్రీకి బుద్ది చెప్పాలంటే ఆ దేశానికి నష్టం కలిగించే చర్యలు తీసకోవాలన్నది చాలా మంది నెటిజన్ల అభిప్రాయం. డ్రాగన్ అవన్నీ తలకెక్కించుకునే పరిస్థితులో ఉందా? అసలది సాధ్యమేనా?
చైనా ఇకనైనా-Can We Change China's Attitude by Banning Their Products
ReplyDelete