Breaking News

ప్రేమ వెనకే గెలుపు,ఐశ్వర్యం కూడా వచ్చాయి


ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి,అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. "లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది.

మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.

భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి"నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా,"అని అడిగింది."లేదు.....కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం"అన్నారు.

ఆ ఇల్లాలు ఆశ్చ్యర్యంతో చూస్తుండగా పెద్దాయన"నా పేరు 'ప్రేమా,ఇతని పేరు 'గెలుపూ,ఈయన పేరు 'ఐశ్వర్యం'.మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్యనించు"అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కారు అని ప్రేమ,గెలుపు,ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది.

సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది.విన్న భర్త పరవశంతో "బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని"అన్నాడు. దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం,ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వనిద్దాం"అని అంది.

వీరి ఇద్దరి మాటలు వింటున్న్న వారి కోడలు,గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్యాభర్తలు,పిల్లలు,అత్తా-కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి"అంటూ సలహ ఇచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ 'అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు.ప్రేమ వెనకే గెలుపు,ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి.ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.

ఆముగ్గురూ"మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది.ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే గెలుపు,ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ"అన్నారు.

1 comment:

  1. ప్రేమ వెనకే గెలుపు,ఐశ్వర్యం కూడా వచ్చాయి

    ReplyDelete