Breaking News

హిందూ పండుగలు మతపరంగా కాకుండా సామాజికంగా,సాంస్కృతికంగా వికసించాయి




హిందూ పండుగలు మతపరంగా కాకుండా సామాజికంగా,సాంస్కృతికంగా వికసించాయి.అటువంటి పండుగయే గణేశ్ చతుర్థి.దేశమంతా వీధుల్లో గణపతి మండపాలు ప్రారంభించటం వెనక వున్న ఉద్దేశ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే పండుగ పరమార్థం నెరవేరుతుంది.

ఇంట్లో భక్తితో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ప్రార్థించే ఈ గణపతి పండుగ ను దేశప్రజలంతా సామూహికంగా దేశభక్తి తో జరుపుకుని ఐక్యత ను నిరూపించుకోవాలని బాల గంగాధర్ తిలక్ స్వాతంత్ర్య పోరాటం లో ఒక భాగంగా మలిచి ప్రజలకు ఒక వరప్రసాదంగా అందించాడు.

గడ్డి పరక మొదలుకుని 24 వృక్షాల ఆకులను,పండ్లను గణపతి కి నైవేద్యంగా పెట్టడం వెనక, మన హిందూ సమాజం పర్యావరణానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని చెప్పాలి.

కేవలం భాగ్యనగర్ లోనే ఈ సారి 40 వేల గణపతి మండపాలు ప్రారంభించినట్లు అధికారికంగా తెలిసింది.ఈ నవరాత్రులు భక్తి తో దేశభక్తిని జోడించి ప్రజలందరిని భాగస్వామ్యం చేయగలిగితే సామాజిక, ధార్మిక చైతన్యం వెల్లి విరుస్తుంది.

మండపాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, రంగస్థల కార్యక్రమాలు,చుట్టుపక్కల వున్న దంపతులతో పూజలు, అన్ని కులాల వారిని పిలిచి సామూహిక భోజనాలు, భక్తి, దేశభక్తి కలిగిన పాటలు, కుటుంబ వాతావరణం కలిగించే కార్యక్రమాలు రూపొందించినట్లయితే పండుగ పరమార్థం నెరవేరుతుంది.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. హిందూ పండుగలు మతపరంగా కాకుండా సామాజికంగా,సాంస్కృతికంగా వికసించాయి

    ReplyDelete