Breaking News

ఈ విధమైన ప్రసారాలను టీవీలో ప్రసారం చేస్తే బాగుంటుంది-TV Shows


ప్రతీ రోజు ఒక స్వాతంత్ర్య సమరయొధుని జీవితంలోని ఒక ఘట్టాన్ని వివరిస్తూ. వారిలా సమస్యలను ఎలా ఎదుర్కోవలో, ఆ ఆలోచనలను నేటి సమస్యలను పరిష్కరించే విధంగా తీర్చిదిద్ది, వాటిని రోజు ప్రసారం చేస్తే నేడు మనలో నాటుకుపోయిన అభధ్రతా భావం పొయి, స్వాభిమానం అభివ్రుధ్ధి చెందుతుంది. దేశం కోసం నేడు మనము ప్రాణ త్యాగాలు చేయవలసిన అవసరం లేదు, మన పనులు మనుకొని వేరెవారిని వుద్దరించవలసిన అవసరం అస్సలు లేదు. దేశానికి అందించాల్సిన మనవంతు భాద్యత మనం ఏ రంగాన్ని ఎన్నుకున్నామో ఆ రంగంలో దేశాన్ని శిఖర స్థాయిలో నుంచోబెట్టాలి. నిజంగా ఎవరికి వారు వారి రంగంలో శ్రధ్ధగా పనిచేస్తే నా దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. ఆ దిశగా అందరూ నడవాలి అని నూరిపోస్తూ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే బాగుంటుంది...

ఉదాహరణ: ఒక విద్యార్ధి తన విద్యార్ది దశలో నైపుణ్యం పై దృష్టి పెడితే. అతని చదువు తరువాత పరిశ్రమలే తన ఇంటి ఎదుట వరుస కడ్తాయ్. ఒక ప్రజా ప్రతినిధి తను ప్రమాణ స్వీకారంలో చెప్పిన మాటలకు కట్టుబడితే నేడు మన ముందు ఉన్న ఎన్నో సమస్యలు ఉండేవి కావు. ఇలా ప్రతీ సమస్యను ఈ కోనంలో చూస్తే అన్నీ సమస్యలకు ఇక్కడే పరిష్కారం లభిస్తుందని నా అభిప్రాయం.స్వామి వివేకానందా చెప్పినట్లు "Every duty is holy, and devotion to duty is the highest form of the worship of God".

- సాయినాథ్ రెడ్డి.

2 comments:

  1. ఈ విధమైన ప్రసారాలను టీవీలో ప్రసారం చేస్తే బాగుంటుంది-TV Shows

    ReplyDelete