Breaking News

తల్లి-విలువలు-సమాజం


నైతికంగా పతనమయ్యే మన యువతరాన్ని రక్షించే భాధ్యత మన తల్లులపై ఉంది. వాళ్ళు ఇంట్లో చక్కటి వాతావరణాన్ని నిర్మించాలి. ఆకలితో ఉన్నా ఆనందంగా భరించాలి. అక్రమ మార్గం ద్వారా సంపాదించిన ధనంతో వచ్చిన అన్నం తినను అనే మనస్థాత్వాన్ని పెంచాలి. తల్లి తన సంతానం పైన ఇటువంటి సంస్కారాన్ని తీసుకొని రాగలిగితే భావితరం తమ దేశంలో ఎటువంటి సవాళ్ళు ఉన్నా విజయవంతంగా ఎదుర్కొంటుంది. ఏ స్త్రీ అయినా ముందుగా తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే సహజంగానే సమాజంలో పవిత్రమైన ఆలోచనలు కలుగుతాయి. దాని ప్రభావం సామాజిక వ్యవహారంలో కనబడుతుంది. అటువంటి ఆలోచనలు స్త్రీ విషయంలో ఆధారభుతమైనవి. ఈ సంస్కారాలు ఆధారభూతంగా ఒక ప్రక్క ఉన్నప్పటికి అత్యాచారాలు, బలత్కారాలు, పురుషాధిక్యత మొదలైన విషయాలు మరోవైపు కనబడుతున్నాయి. బోగ వాదంయొక్క ప్రభావంను తగ్గించడంలో సమాజం విజయవంతం కాలేకపోతుంది. అయితే ఈ దుర్గతి నుండి సమాజాన్ని రక్షించడానికి ఉదార్తత అవసరం అది మాతృభావనలోనే ఉంది.
- శ్రీ గురూజీ

2 comments:

  1. తల్లి-విలువలు-సమాజం

    ReplyDelete
  2. తల్లి-విలువలు-సమాజం

    ReplyDelete