Breaking News

న్యాయదేవత కళ్లుగప్పారు


నక్కజిత్తుల మొసగాళ్లు
నక్కి నక్కి నమ్మబలికి
నల్లగుడ్డ నొకటి తెచ్చి
న్యాయదేవత కళ్లుగప్పారు

కూడులేని నిరుపేదలు
గూడులేని నిర్భాగ్యులు
న్యాయం కొసం - ధర్మం కొసం
న్యాయదేవత త్రాసువైపు
నిరీక్షించి - నిరీక్షించి
నీరసించిపొతున్నారు.

నిరంతరం నీతి కొరకు
నిలబడేవారు కావాలోయ్
నల్లగుడ్డ విప్పగలిగే
ధర్మనిరతులు కావాలోయ్
సమసమాజ స్థాపనకై చట్టాలే రావాలోయ్
నవతరాన్ని నడిపించే నాయకులే కావాలోయ్
న్యాయం మనకివాలోయ్!

- జస్టీస్ బి.చంద్రకుమార్

1 comment:

  1. న్యాయదేవత కళ్లుగప్పారు

    ReplyDelete