Breaking News

మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy)

జననం: జనవరి 13, 1919
మరణం: డిసెంబర్ 2, 1996

మర్రి చెన్నారెడ్డి రెండు పర్యాయాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు. చెన్నారెడ్డి జనవరి 13, 1919న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా, వికారాబాదు తాలూకాలోని సిరిపుర గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయన 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్ధిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి మరియు విద్యార్ధి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్ధి, యువత, విద్యా, అక్షరాస్యత మరియు సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈయన ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1996లో చెన్నారెడ్డి మరణించాడు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులో ఇందిరా పార్కు ఆవరణలో ఉన్నది. తెలంగాణా కోసం ఓ పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆపార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.
మూలం: వికీపిడియా






1 comment:

  1. ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి...

    ReplyDelete