Breaking News

1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (1857-1947 Freedom Fighters)

మంగళ్ పాండే ఆవేశం తో సైనికాధికారులను(మేజర్ హ్యూసన్,లెఫ్టినెంట్ వాఘ్) చంపివేయటం తో 1857 యుద్ధం ఊపందుకుంది.

1857 అనగానే అది సిపాయిల తిరుగుబాటు అని చెపుతారు..ఎందుకంటే మన పాఠ్యపుస్తకాల్లో అలాగే వ్రాశారు.అలా వ్రాసింది కమ్యునిష్టు భావాలు కలిగినవారు,దేశభక్తి అన్నా,దేశం కోసం గొప్ప పోరాటం భారతీయులు చేశారన్నా ఈ కమ్యునిష్టులకు ఒళ్ళు మంట.ఆ జాఢ్యం ఇప్పటికీ వుంది..తెలంగాణ ప్రభుత్వంలోని కమ్యూనిష్ట్ భావాలు కలిగిన వారు చేరి మన నిజమైన చరిత్ర ను,రామాయణ,భారత కథలను చేర్చకుండా కుట్ర పన్నుతున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు.మీరు కొద్ది రోజుల్లో కొత్త పుస్తకాలు చూస్తారు కదా.అప్పుడు మీకే అర్థమవుతుంది.

1857 గొప్ప విప్లవం కూడా తక్కువ చేసి చూపించిన ఘనత ఈ కమ్యునిష్టు-మార్క్సిష్టులదే..నిజమేమిటంటే అది సిపాయీల తిరుగుబాటు కాదు.వేలాది సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి అంగ్లేయులపై యుద్ధం ప్రకటించారు.అందుకే దాన్ని మొదటి స్వాతంత్ర్య పోరాటం అని పిలవటం వల్ల బలిదానం చేసిన వీరుల ఆత్మకు శాంతి లభిస్తుంది.

కలకత్తా లోని ఆంగ్లేయులు,సైనికులకు ఇచ్చిన తుపాకుల్లో ఆవు కొవ్వు,పంది కొవ్వు ని దట్టించారు.నోటితో అది తొలగించి గాని అది ప్రేల్చలేము.హిందువులను,ముస్లిముల మనోభావాలు దెబ్బతీయటమే వాళ్ళ ముఖ్యమైన పని.

మార్చ్ 29 న కలకత్తా లోని సైనికుల శిబిరంలో అనుకున్నదాని కంటే ముందుగా సమర యోధుడు,సైనికుడు మంగళ్ పాండే ఆవేశం తో సైనికాధికారులను(మేజర్ హ్యూసన్,లెఫ్టినెంట్ వాఘ్) చంపివేయటం తో 1857 యుద్ధం ఊపందుకుంది.మంగళ్ పాండే ని పట్టికుని ఏప్రిల్ 8న ఉరిశిక్ష విధించారు.తలార్లు ఎవరు కూడా ఉరి వేయటానికి అంగీకరించలేదు.మరో ప్రాంతం నుండి తెప్పించి ఉరి వేశారు. దాంతో 1100 మంది సైనికులు దీనికి విరుద్ధంగా బారక్ పూర్ నుండి బయల్దేరి గంగా నది కి వెళ్ళి దోసిట్లో నీళ్ళు తీసుకుని స్వాతంత్ర్య పోరాటానికి సంకల్పం చేసారు.వీళ్ళు గ్రామ,గ్రామాలు తిరిగి మంగళ్ పాండే అమరగాథ గురించి వివరించేవారు.పల్లెలు,పట్టణాల్లో ప్రజల్లో ఆంగ్లేయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు.మే 9 న సైనికులు అందరూ కలిసి యోజన చేసారు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. 1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (1857-1947 Freedom Fighters).

    ReplyDelete