Breaking News

మన ఉగాది కొత్త సంవత్సరం ఏమి నేర్పుతుంది


డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే! మన ఉగాది కొత్త సంవత్సరం ఏమి నేర్పుతుంది.?..సూర్యోదయం తో పండుగ మొదలవుతుంది.కనుక డిసంబర్ 31అర్థరాత్రి పిచ్చి పనులకు అవకాశం లేదు.ఉదయం తల స్నానం చేసి ,దేవున్ని మొక్కి,కొత్త బట్టలు తొడిగి,బంధువులు,తల్లిదండ్రులు,స్నేహితులతో కలిసి వేప పువ్వు పచ్చడిని తీసుకుంటాం.పొరుగువాళ్ళకు పంచుతాము.ముగ్గులు,మామిడి తోరణాలతో అలంకరించుతాము.ఆరోగ్యకరమైన పచ్చడి, సాంప్రదాయ భోజనాలు స్వీకరిస్తాము. సాయంత్రం దేవాలయం వెళ్ళి,లేదా రచ్చబండ వద్ద పంచాంగ శ్రవణం తో గడుపుతాము.

ఖగోళం ప్రకారం కాలమనం లెక్కించే పద్దతి తెలుస్తుంది.జీవితం లో నియమ బద్ధత ఏర్పడుతుంది.ఆద్యాత్మిక ప్రశాంతి ఏర్పడుతుంది.కుటుంబమంతా సంతోషంగా వుంటుంది.తప్ప త్రాగటం, తూలటం,పిచ్చిగా వాగటం ఏమీ వుండవు.మన ఉగాది పండుగ మనకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పుతుందంటే ....ఉగాదిని మనం ఎందుకు ఘనంగా జరుపుకోకూడదు? ఈ విషయాన్ని అందరికీ ఎందుకు అర్థం చేయకూడదు? రక రకాలైన కాలేయ సంబంధమైన రోగాలకు కారణమైన మద్యం త్రాగటం కంటె...వేపపువ్వు,కొత్తబెల్లం,శనగపప్పు,అరటిపళ్ళు,మామిడిముక్కలు,కొబ్బరిముక్కలు,చెరకు గడలు మొదలైన వాటితొ ఉగాది పచ్చడి చేసుకుని త్రాగితే నిజంగా ఆరొగ్యం కాదా?

డిశంబర్ 31 ని మాములుగానే పోనియ్యండి..క్యాలండెర్ ని జనవరి 1 కి మాములుగానే మార్చండి. ఆ ఒక్క రాత్రి ఎప్పుడూ పడుకున్నట్లే,నిద్ర పోయి, ఆ ఒక్క రోజును మరిచిపోతే మీ జన్మ ధన్యమైనట్లే!
- అప్పాల ప్రసాద్.

2 comments:

  1. మన ఉగాది కొత్త సంవత్సరం ఏమి నేర్పుతుంది

    ReplyDelete