కె.వి.రంగారెడ్డి (కొండా వెంకట రంగారెడ్డి) (Konda Venkata Ranga Reddy)
కొండా వెంకట రంగారెడ్డి(1890 - 1970) స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు వచ్చింది. 1959 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో కూడా మంత్రి పదవి నిర్వహించాడు.
రంగారెడ్డి ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాదు మండలం, పెద్దమంగళారం గ్రామంలో డిసెంబరు 12, 1890న జన్మించాడు. రంగారెడ్డి ఆంధ్రమహాసభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్లో జరిగిన ఐదవ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఈయన నిజాం శాసనసభలో, హైదరాబాదు రాష్ట్ర శాసనసభలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఈయన మేనల్లుడు. 1970 జూలై 24న రంగారెడ్డి మరణించాడు. ఈయన స్మృత్యర్ధం 1978, ఆగష్టు 15న హైదరాబాదు జిల్లాను విభజించి నూతనంగా ఏర్పడిన జిల్లాకు రంగారెడ్డి జిల్లా అని పేరుపెట్టారు.
స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి కొండా వెంకటరంగారెడ్డి.
ReplyDelete