Breaking News

రాత్రి 12 గంటలు దాటి, ఉదయం 1 గంట అయి 'రోజు ' మారుతుంది కదా?


రాత్రి 12 గంటలు దాటి, ఉదయం 1 గంట అయి 'రోజు ' మారుతుంది కదా? ఉదాహరణకు డిశంబర్ 31 రాత్రి 12 గంటలు దాటి, 1గంట కొట్టగానే జనవరి 1 వ తేది వచ్చేస్తుంది కదా? ఇది ఇంగ్లీష్ వాళ్ళ క్యాలెండర్.మరి రాత్రి 12 గంటలకు అంతరిక్షంలో ,ఖగోళం ప్రకారం ఏ మార్పు జరగకుండానే క్యాలండర్లొ రోజు మారింది.

మరి మన పంచాంగం ప్రకారం ఖగోళ శాస్త్రం ఆధారంగా అంతరిక్షం లో సూర్యుడు ఉదయించగానే రోజు మొదలవుతుంది.సూర్యుడు అస్తమించగానే రోజు సమాప్తమవుతుంది. అందుకే మన పండుగలు కూడా సూర్యోదయంతో మొదలవుతాయి.మీరు చెప్పండి..ఏ ఆధారం,ప్రత్యేకత,వాతవరణ మార్పు లేని డిశంబర్ 31 అర్ధరాత్రి - జనవరి 1 కి ఇంత ఆడంబరాలు,అట్టహాసాలు, అవసరమా?

మరి మీరు అడగొచ్చును. బ్రిటిష్ వాళ్ళ క్యాలండర్ మీరు మార్చలేరా? అని.ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే!అందుకే మనం మనం అడుక్కోవటం,వెక్కిరించుకోవటం,దెప్పి పొడుచుకోవటం మనకు తగదు..అలా ఒకవేళ మనకు మనమే పరిహాసం చేసుకుంటుంటే,బ్రిటిష్ వాడి క్యాలండర్ వచ్చి మన మధ్య కొట్లాట పెట్టినట్లవుతుంది.

అందుకే ఒక్కరోజులో ఏదీ మార్చలేము..మనం కలిసి మన కొత్త సంవత్సరం ఉగాది గొప్పతనమేమిటో మీ ఫ్రెండ్స్ కి చెప్పటం మొదలు పెట్టండి.తరువాత చూడండి..గడ్డి పరకలు ఒక్కటొక్కటి కలిస్తే మద గజాన్ని కూడా బంధిస్తాయని నీకు తెలియదా? అదే జరగబోతోంది ముందు ముందు.ఎందుకంటే పంచాంగం లో ముహూర్తం చూడకుండా,వివాహాలు,పుణ్య కార్యాలు జరగవిక్కడ.పంచాంగం చూసిన తరువాతనే సైన్స్ పరిశొధనలు మొదలవుతాయి.విశేషమేమిటంటే అంతరిక్షములో ఉపగ్రహాన్ని ప్రయోగించినా మంచి ముహూర్తం చూడవలసిందే.ఇక్కడ..మన మతంలో సైన్స్ వుందనీ ..మన సైన్స్ మతం ఆధారంగా మానవులకు మేలు చేస్తుందనీ మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.
-అప్పాల ప్రసాద్.

1 comment:

  1. రాత్రి 12 గంటలు దాటి, ఉదయం 1 గంట అయి 'రోజు ' మారుతుంది కదా?

    ReplyDelete