Breaking News

తుమ్మల దుర్గాంబ

జననం: 1907
మరణం 1984 నవంబర్ 2

తుమ్మల దుర్గాంగ' (1907 - 1984) సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త మరియు కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు.

ఈమె 1907 లో పర్వతనేని కృష్ణయ్య భూషమ్మ దంపతులకు జన్మించింది. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం ఈమెకు కావూరుకు చెందిన తుమ్మల బసవయ్య గారితో వివాహం జరిగింది.

వీరు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించి దహనం చేసి మరలా రాయవెల్లూరు జైల్లో ఆరు నెలలు శిక్షను అనుభవించారు.

వీరు భర్తతో కలిసి కావూరులో వినయాశ్రమం స్థాపించారు. 1934 ఆయుర్వేద వైద్యశాల స్థాపించారు. పిల్లలకోసం గురుకుల పాఠశాల స్థాపించారు.1935లో మీరా బెన్ చేత స్వరాజ్య స్థూపం ఆవిష్కరింపజేశారు. 1939 నుండి చరఖా ప్రచారం చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకు దీక్షవహించారు.

వీరు 1984 నవంబర్ 2 తేదీన పరమపదించారు.

2 comments:

  1. సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త మరియు కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు తుమ్మల దుర్గాంబ.

    ReplyDelete
  2. Service to the humanity is service to the god.

    ReplyDelete