Breaking News

ధైర్యం, తెగువ, అపార దేశభక్తి “నేతాజీ సుభాష్ చంద్రబోస్"


ధైర్యం, తెగువ, అపార దేశభక్తి, అసాధారణ వ్యూహ రచన ఇవన్నీ కలగలిపిన మహోన్నత వ్యక్తి “సుభాష్ చంద్రబోస్”. ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన గొప్ప యోధుడు, నాయకుడు మన “నేతాజీ” భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీని కూడా ఓడించిన నాయకుడు నేతాజి, సాయుధ సంగ్రాంతోనే స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మిన నేతాజి బ్రటీషువారికి వ్యతిరేకంగా జపాన్, జర్మనీలతో చేతులు కలిపి తన సైన్యంతో ఈశన్య భారతంలోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకోగలిగిన నేతాజీ 1897 లో, భారత దేశంలోని ఒరిస్సా లోని కటక్ పట్టణం లో ఒక ధనిక కుటుంబం లో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది.

బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోను సాగింది. 1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్ధి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్‌నుండి వైదొలగాడు. వేరు మార్గం లేని బోస్ “అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్” పార్టీని స్థాపించాడు. 1938లో “జాతీయ ప్రణాళికా కమిటీ” అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు.బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ మాజినీల ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం.
మూలం: telanganaheadlines.in

5 comments:

  1. ధైర్యం, తెగువ, అపార దేశభక్తి “నేతాజీ సుభాష్ చంద్రబోస్".

    ReplyDelete
  2. Why British left India - Netaji's Role

    https://www.youtube.com/watch?v=SKpl7v_c-Qo

    ReplyDelete
  3. He is the real meaning of HERO.

    ReplyDelete