మదన్ మోహన్ మాలవ్యా
జననం: 25 డిసెంబరు 1861-అలహాబాదు
మరణం :నవంబరు 12, 1946
మదన్ మోహన్ మాలవ్యా (1861-1946) ఒక రాజకీయ నాయకుడు. భారత స్వాతంత్ర సమరంలో తాను వహించిన పాత్రకు ప్రఖ్యాతి గడించాడు.
1861, డిసెంబరు 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో పుట్టిన మాలవ్యా చిన్నప్పటి నుండి వేదాంతము చదివాడు.
యుక్త వయస్సులో రెండు దినపత్రికలు హిందుస్తాన్(హిందీ) మరియు ది ఇండియన్ యూనియన్(ఇంగ్లీషు) లను స్థాపించాడు. భారత జాతీయ కాంగ్రెస్కు 1909లో మరియు 1918లో అధ్యక్షునిగా పనిచేసాడు. బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు.
"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.
భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా.
ReplyDelete