Breaking News

జమ్నాలాల్‌ బజాజ్‌

జననం :4 నవంబరు 1884
మరణం :ఫిబ్రవరి 11, 1942

ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయో ధుడు జమ్నాలాల్‌ బజాజ్‌... నేటి రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నవంబర్‌ 4, 1888వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్‌ కోశాధికారిగా పని చేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.

2 comments:

  1. ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు జమ్నాలాల్‌ బజాజ్‌.

    ReplyDelete
  2. He is the founder of Bajaj Group

    ReplyDelete