Breaking News

'పాతరేస్తా.'..అన్న నోటి నుండే 'పార పట్టి చెత్త తీస్తా ,మీరు కూడా శుభ్రం చేయండి'


'పాతరేస్తా.'..అన్న నోటి నుండే 'పార పట్టి చెత్త తీస్తా ,మీరు కూడా శుభ్రం చేయండి ' అని మన ముఖ్యమంత్రి ఇషారా చేస్తే టి.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇతర పార్టీల వార్డ్ మెంబర్లు,సర్పంచులు మొదలుకుని ఇతర పార్టీల శాసనసభ్యులతో సహా పార్టీ లోని వందిమాగధులు అందరూ తు.చ .తప్పకుండా పాటించేవారు.

******1965 లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు,కరువు కాటకాలతో దేశం ఇబ్బందులతో వున్నప్పుడు,అప్పటి ప్రఢాని లాల్ బహదూర్ శాస్త్రి 'దేశ ప్రజలందరితో ఒక రోజు ఉపవాసం వుండి,ఆ ఆదా అయిన ధాన్యాన్ని సైనికులకు పంపమని చెప్పగానే ప్రజలు ఆ మాట విని దేశానికి అండగా నిలిచారు.పాకిస్తాన్ ని ఓడించారు.

అదే రీతిలో నేటి మన ప్రధాని నరేంద్రమోడి గాంధి జయంతి రోజున స్వచ్చ భారత్ కోసం పిలుపు ఇవ్వగానే కోట్లాది ప్రజలు స్వచ్చంధంగా చీపుర్లు పట్టారు.కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది పరిశుభ్రతకోసం నడుం కట్టారు.ఆ రోజున ఒక ఫ్లెక్సీ పై వున్న తన చిత్రాన్ని తొలగించి తన నిరాడంబరతను చాటి చెప్పారు.

సుప్రీంకోర్ట్ జడ్జిలు పరిసరాలు శుభ్రం చేసారు.

సామాన్యులు మొదలుకొని కార్పొరేట్ దిగ్గజాలు వీధులు వూడ్చారు.

సాక్షాత్తూ దేశానికి మొదటిపౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాను గతంలో చదువుకున్న కలకత్తా బడిలో విద్యార్థులతో చీపురు పట్టారు.

మాజీ ప్రధాని శ్రీ దేవెగౌడ చీపురు పట్టారు.

అమీర్ ఖాన్ మొదలు సినిమా జగత్తూ రంగం లోకి దూకింది..

మాజీ ముఖ్యమంత్రి,తమిళనాడు గవర్నరు శ్రీ రోశయ్య వీధిలోకి వచ్చి స్వచ్చతకు శ్రీకారం చుట్టారు.,

మరి మన తెలంగాణా ముఖ్యమంత్రి కి ఏమైంది? ఆయన బిడ్డ కవితమ్మ పార్లమెంట్ సభ్యురాలు ఎక్కడుంది? ఆయన మంత్రులు ఎమి చేస్తున్నారు.?'పాతరేస్తా.'..అన్న నోటి నుండే 'పార తీసి చెత్త తీస్తా అని,మీరు శుభ్రం చేయండి ' అని మన ముఖ్యమంత్రి ఇషారా చేస్తే టి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇతర పార్టీల వార్డ్ మెంబర్లు,సర్పంచులు మొదలుకుని ఇతర పార్టీల శాసనసభ్యులు తు.చ .తప్పకుండా పాటించేవారు.

ఒకరిద్దరు ఈటెల రాజెందెర్,కమలకర్ వంటి గౌరవనీయ వ్యక్తులు మినహాయించి, ఆయన భజన చేస్తూ,ఆయన అండ చేరిన వామపక్షమేధావులు, పత్రికలు, వ్యాసకర్తలు, కవులు,సంపాదకులు, జర్నలిస్టులు.ముఖ్యమంత్రి చుట్టూ చేరిన అవకాశవాదులకు తెలంగాణా ప్రాంతం లోని గ్రామాల్లో స్వచ్చత అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 20లక్షల రూపాయలు గ్రామాల పరిశుభ్రత కు ఇస్తామని ఇచ్చిన ప్రకటన వీళ్ళ చెవులకు చేరిందా? ముఖ్యమంత్రికి సలహాలిచ్చే ధైర్యవంతులైన మనుషులే కరువయ్యారా? గాంధీజీ చెప్పిన స్వచ్చత ఉద్యమంలో కూడా రాజకీయాలను చూసేవారిని,గొంగట్లో గొంగలి పురుగులను ఏరుకునే వారిగా తెలంగాణా ప్రజలు జమకట్టరా?

మన తెలంగాణా గవర్నరు ఆయన భార్య కలిసి పాఠశాలల్లో బట్టతో బెంచీలను శుభ్రం చేస్తున్న దృశ్యాలు మనసులను కదిలించి వేశాయి..దేశభక్తి గుండె నిండా పొంగింది.గవర్నరు కున్న కామన్ సెన్స్ తెలంగాణా పేరు చెప్పుకొని పరిపాలించే నాయకులకు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తే తోలు బొమ్మ మేధావులకు లేకపోవటం, మన ప్రాంతానికే సిగ్గుచేటు..

రాజకీయాలకు అతీతంగా వచ్చిన ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకోవటం మన ప్రభుత్వానికే చెల్లింది.

ముఖ్యమంత్రికి చెప్పేవారు లేకనా? తప్పుడు సలహాలు ఇచ్చేవారు చుట్టు చేరారా? లేక మైనారిటీ బుజ్జగింపు ధోరణి ముఖ్యమంత్రి నశాలానికెక్కిందా? ఇవన్ని కొద్దిరోజుల్లో ప్రజలే తేల్చి చెప్పుతారు.
-  అప్పాల ప్రసాద్

3 comments:

  1. 'పాతరేస్తా.'..అన్న నోటి నుండే 'పార పట్టి చెత్త తీస్తా ,మీరు కూడా శుభ్రం చేయండి'.

    ReplyDelete
  2. well said prasad garu

    ReplyDelete