కల్లూరి తులశమ్మ
జననం:1910 డిసెంబరు 25
మరణం: 2001 అక్టోబరు 5
కల్లూరి తులశమ్మ (1910 - 2001) ప్రముఖ సంఘసేవకురాలు మరియు ఖాదీ ఉద్యమ నాయకురాలు.
ఈమె 1910 డిసెంబరు 25 తేదీన కొడాలి కృష్ణయ్య మరియు సీతమ్మ దంపతులకు జన్మించింది. 14 సంవత్సరాల వయసులో కల్లూరి రంగయ్య గారితో వివాహం జరిగింది.
తులశమ్మ గాంధీగారి పిలుపు విని 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1942లో తెనాలి కోర్టు ప్రాంగణంలో పికెటింగ్ నిర్వహిస్తున్నందుకు అరెస్టయి వారంరోజులు జైలులో ఉన్నారు. విచారణ సమయంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిని 16 నెలలు రాయవెల్లూరు సెంట్రల్ జైల్లో నిర్భంధించారు.
ఈమె ఖాదీ ఏజెంటుగా ప్రజల్లో ఖద్దరు మీద ఆసక్తిని పెంచారు. ఆ రోజుల్లో ఖద్దరు అమ్మకంపై వచ్చిన ఆదాయంతో 3 వేల రూపాయలతో ఇంటిని కొని 1977లో గుంటురు జిల్లా ఖాదీ సంస్థకు అప్పగించారు.
ఈమె 2001 అక్టోబరు 5 తేదీన పరమపదించారు.
కల్లూరి తులశమ్మ.
ReplyDelete